MSG | మెగాస్టార్ చిరంజీవి హీరోగా, లేడీ సూపర్‌స్టార్ నయనతార హీరోయిన్గా నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘మన శంకర వరప్రసాద్ గారు’ చిత్రం కోసం మెగా ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ భారీ చిత్రంలో విక్టరీ వెంకటేష్ కీలక పాత్రలో కనిపించనున్నారు. 2026 సంక్రాంతి బరిలో సినిమాను విడుదల చేయాలని మేకర్స్ లక్ష్యంగా పెట్టుకున్నారు. షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా కొనసాగుతోంది. ఇటీవల దసరా సందర్భంగా విడుదలైన ‘మీసాల పిల్ల’ ఫస్ట్ సింగిల్ ప్రోమో మెగా అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. చిరంజీవి గ్రేస్, ఎనర్జీతో చేసిన స్టెప్పులు, భీమ్స్ సిసిరీలియో ఇచ్చిన బీట్ ఫ్యాన్స్‌ను ఫుల్ ఉత్సాహంలోకి తెచ్చాయి.
ఇప్పుడు ఆ పాట ఫుల్ లిరికల్ వీడియో కోసం ఎదురుచూస్తున్న అభిమానుల కోసం ఫుల్ సాంగ్ విడుదల చేశారు. ఈ సాంగ్ శ్రోతలని ఎంతగానో ఆకట్టుకుంది. లిరిక్స్ చాలా క్యాచీగా ఉన్నాయి. ఉదిత్ నారాయణ చాలా రోజుల తర్వాత చిరు సినిమా కోసం వాయిస్ అందించారు. దీంతో సాంగ్‌పై హైప్ మరింత పెరిగింది. ‘మీసాల పిల్ల’ పాటకు భీమ్స్ సిసిరీలియో ఎనర్జిటిక్ మ్యూజిక్ అందించిన విషయం తెలిసిందే. చిరంజీవి స్టెప్పులు, అనిల్ మాస్ ట్రీట్మెంట్ కలిస్తే ఈ పాట సంక్రాంతి సెన్సేషన్ అవుతుందనే అంచనాలు పెంచేసింది. మొత్తానికి, ‘మన శంకర వరప్రసాద్ గారు’ సినిమా నుంచి వస్తున్న ప్రతి అప్డేట్ మెగా అభిమానుల్లో కొత్త ఉత్సాహం నింపుతోంది. ‘మీసాల పిల్ల’ ఫుల్ సాంగ్ విడుదల కావడంతో మెగా ఫ్యాన్స్ సంబరాల్లో మునిగిపోయారు.
కాగా, . గతంలో ఉదిత్ నారాయణ చిరంజీవి కోసం ‘కైకలూరి కన్నేపిల్లా’, ‘రామ్మా చిలకమ్మా’, ‘వానా వానా’, ‘రాధే గోవింద’ వంటి సూపర్‌హిట్ సాంగ్ పాడారు. చాలా రోజుల తర్వాత ఇప్పుడు మన శంకర వరప్రసాద్ గారు కోసం మీసాల పిల్ల పాట పాడి ఛార్ట్‌బస్టర్ చేశారు. ఈ పాట ఇంత సక్సెస్ కావడం పట్ల ఫ్యాన్స్ కూడా ఫుల్ ఖుషీ అవుతున్నారు