ఆదిలాబాద్, అక్టోబర్ 13(నమస్తే తెలంగాణ) : పేద విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు బాటలు వేసే దిశగా ప్రభుత్వం అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకం నీరుగారుతున్నది. ఇందులో భాగంగా ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల చదువులకు ఆటంకం కలుగుతున్నది. ఈ పథకం కింద ప్రభుత్వం పేద విద్యార్థులకు ఒకటో తరగతి నుంచి మూడో తరగతి వరకు నాన్ రెసిడెన్షియల్.. ఐదో తరగతి నుంచి పదో తరగతి వరకు రెసిడెన్షియల్ చదువుల కో సం ప్రైవేటు పాఠశాలల్లో చదువుకునే అవకాశం కల్పించింది.
ప్రభుత్వం పాఠశాలలకు నిధులు విడుదల చేయకపోవడం తో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు విద్యార్థులను రానివ్వ డం లేదు. దీంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సోమవారం ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. బెస్ట్ అవైలబుల్ పథకంలో భాగంగా ప్రభుత్వం గు ర్తించిన ప్రైవేటు పాఠశాలల్లో వారి పిల్లలను అధికారులు ఎం పిక చేశారని విద్యార్థుల తల్లిదండ్రులు తెలిపారు. దసరా సెలవుల తర్వాత విద్యార్థులను పాఠశాలలకు తీసుకురావద్దని ఫోన్‌కు మెస్సేజ్‌లు పంపారని వాపోయారు. దసరా సెలవుల నుంచి పిల్లలు ఇంటివద్దనే ఉంటున్నారని, ప్రభుత్వ పాఠశాలల్లో చదివించుకునేందుకు టీసీలు ఇవ్వమని ప్రైవేటు స్కూళ్ల సిబ్బందిని అడిగితే పైసలు వచ్చేంత వరకు టీసీలు ఇవ్వమని అంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాల గొడవల వల్ల పిల్లల చదువులకు ఆటంకం కలిగిందని తెలిపారు.
ఆదిలాబాద్ కలెక్టరేట్ ఎదుట ధర్నా
తమ పిల్లల చదువులపై ఆందోళన చెందుతున్న తల్లిదండ్రులు సోమవారం విద్యార్థులతో కలిసి ఆదిలాబాద్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. కుమ్రం భీం చౌరస్తా నుంచి కలెక్టరేట్ వరకు ప్లకార్డులు పట్టుకొని ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వం, ప్రైవేటు పాఠశాలల తీరును నిరసిస్తూ నినాదాలు చేశారు. బెస్ట్ అవైలబుల్ పథకం కింద ప్రైవేటు పాఠశాలల్లో ఎంపికైన తమ పిల్లల భవిష్యత్‌పై ఎన్నో ఆశలు పెట్టుకున్నామని, ప్రభుత్వం తమ పిల్లల చదువులు కొనసాగించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. అనంతరం ప్రజావాణిలో ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షి షాకు వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి..
మా కూతురు అనన్య ఆదిలాబాద్ పట్టణంలోని ప్రైవేటు పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుకుం టున్నది. బెస్ట్ పథకంలో భాగంగా ఎంపిక కాగా నిధులు రావడం లేదంటూ ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యం అనుమతించడం లేదు. దీంతో దసరా సెలవుల నుంచి మా పాప ఇంటి వద్దనే ఉంటున్నది. ఈ విషయం అధికారులకు చెప్పినా తాము ఏమీ చేయలేమని అంటున్నారు. ఈ సమస్యను పరిష్కరిం చాలంటూ కలెక్టర్‌ను కలిసి వినతిపత్రం అందజేశాం. ప్రభుత్వం పేద విద్యార్థుల చదువులకు ప్రోత్సాహం అందించాలి. ప్రైవేటు పాఠశాలలకు ఇవ్వాల్సిన నిధులు విడుదల చేసి పిల్లల చదువులు కొనసాగేలా చర్యలు తీసుకోవాలి.
– కల్లెపల్లి రాజు, ఖానాపూర్, ఆదిలాబాద్
పాఠశాలకు తీసుకురావద్దని ఫోన్‌కు మెస్సేజ్ పంపారు
మా కుమారుడు మహిపాల్ నాయక్ ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు పాఠశాలలో ఎనిమిదో తరగతి చదువుతున్నాడు. ఉట్నూర్ ఐటీడీఏ ద్వారా మా బాబుకు ప్రైవేటు పాఠశాలలో చదువుకునే అవకాశం కల్పించారు. ప్రభుత్వం నుంచి బెస్ట్ అవైలబుల్ పథకం నిధులు రావడం లేదంటూ ప్రైవేటు పాఠశాలల యాజమాన్యా లు ఈ విద్య సంవత్సరం ప్రారంభం నుంచి ఇబ్బందు లు పెడుతున్నారు. పాఠశాలలకు జూన్ 12న ప్రారం భమైతే జూలై 23న అనుమతించారు. పుస్తకాలు, డ్రెస్స్‌లు కూడా ఇవ్వలేదు. పాఠశాల కమిటీ సమావే శాలు నిర్వహించడం లేదు. దసరా సెలవుల విషయం లో తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదు. మేము తెలుసుకొని పిల్లలను పాఠశాల నుంచి ఇంటికి తీసుకు పోయాం. దసరా సెలవులు తర్వాత మీ పిల్లలను స్కూల్‌కు తీసుకురావద్దంటూ ఫోన్లో మెస్సేజ్ పెట్టా రు. ఈ విషయం అధికారులకు సూచించిన స్పందన లేదు. – అమృతలాల్, విద్యార్థి తండ్రి (నేరడిగొండ)