Ayushmann Khurrana | బాలీవుడ్ నటుడు ఆయుష్మాన్ ఖురానా, నేషనల్ క్రష్ రష్మిక మందన్న ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం థామా (Thama). ఈ చిత్రం దీపావళి కానుకగా అక్టోబర్ 21న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా చిత్రబృందం వరుస ప్రమోషన్స్ నిర్వహిస్తుంది. అయితే ఈ సినిమా విజయం సాధించాలని నటులు ఆయుష్మాన్ ఖురానా, రష్మిక మందన్న మహారాష్ట్రలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం షిర్డీని సందర్శించారు. మంగళవారం మధ్యాహ్నాం షిరీడికి చేరుకున్న వీరిద్దరూ షిర్డీ సాయిబాబా సమాధి వద్ద ప్రత్యేక పూజలు చేసి, బాబా ఆశీస్సులు తీసుకున్నారు. ఈ సందర్భంగా రష్మిక మందన్న లేత గులాబీ రంగు సాంప్రదాయ దుస్తుల్లో కనిపించగా, ఆయుష్మాన్ ఖురానా పసుపు రంగు కుర్తా, తెల్లటి పైజామా ధరించారు. దర్శనం అనంతరం నటీనటులు తమ అనుభవాలను పంచుకున్నారు. ఆయుష్మాన్ ఖురానా 17 ఏండ్ల తర్వాత షిర్డీకి రావడం ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు. రష్మిక మందన్న కూడా రెండోసారి సాయిబాబా దర్శనం చేసుకోవడం అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొంది.