Victims Families | తొగుట, ఏప్రిల్ 20 : బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని మండల బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు జీడిపల్లి రాంరెడ్డి తెలిపారు. ఇవాళ మండలంలోని వెంకట్రావుపేటకు చెందిన దుర్గనోల్ల బుధవ్వ అనారోగ్యంతో మరణించగా.. ఆమె మృత దేహనికి నివాళి అర్పించారు. బుధవ్వ మృతి పట్ల విచారం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులను ఓదార్చి తన వంతుగా రూ.3 వేల ఆర్థిక సహాయం అందించారు.
అలాగే ఇటీవల మండల పరిధిలోని తుక్కాపూర్ గ్రామంలో విద్యుత్ ప్రమాదం మూలంగా సాయి ప్రణీత్ అకాల మరణం కలిచి వేసిందని మండల జీడిపల్లి రాంరెడ్డి, మాజీ వైస్ ఎంపీపీ బాసిరెడ్డి, శ్రీకాంత్‌రెడ్డి విచారం వ్యక్తం చేశారు. తుక్కాపూర్ లో చిక్కుడు స్వామిని పరామర్శించారు.
పండుగలో పాల్గొనడానికి వొచ్చిన చిక్కుడు స్వామి కుమారుడు సాయి ప్రణీత్ విద్యుత్ ప్రమాదంలో మరణించడం బాధాకరమన్నారు. పరామర్శించిన వారిలో మాజీ మార్కెట్ చైర్మన్ దోమల కొమురయ్య, గ్రామ పార్టీ అధ్యక్షుడు చెరుకు లక్ష్మారెడ్డి, నాయకులు సుతారి రాములు, బోయిని బాలరాజు, చిక్కుడు రాజు, ఎంగలి లక్ష్మణ్ సయ్యద్ అజాం, మల్లేశం తదితరులున్నారు.
CC cameras | నేరాల నియంత్రణలో సీసీ కెమెరాల పాత్ర కీలకం
Indigo flight | విమానాన్ని ఢీకొట్టిన టెంపో ట్రావెలర్.. ఆ తర్వాత ఏం జరిగిందంటే?