న్యూజిల్యాండ్ వెటరన్ ప్లేయర్ రాస్ టేలర్ చాలా కాలం ఆ దేశ క్రికెట్‌కు సేవలందించాడు. తాజాగా రిటైర్మెంట్ ప్రకటించిన అతను.. సోమవారం నాడు నెదర్లాండ్స్‌తో జరిగిన అంతర్జాతీయ గేమ్ తనకు చివరిదని ప్రకటించాడు. ఈ క్రమంలో పలువురు క్రికెటర్లు టేలర్‌కు అభినందనలు తెలిపారు. భారత జట్టు మాజీ కెప్టెన్, స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ కూడా టేలర్‌కు శుభాకాంక్షలు తెలిపాడు. దీనికి సంబంధించిన వీడియోను న్యూజిల్యాండ్ క్రికెట్ బోర్డు.. తమ సోషల్ మీడియా ఖాతాలో విడుదల చేసింది.
ఈ వీడియోలో కోహ్లీ మాట్లాడుతూ.. ‘‘అద్భుతమైన కెరీర్ సాగించినందుకు అభినందనలు. న్యూజిల్యాండ్ క్రికెట్‌కు నువ్వో లెజెండ్వు. ఈ ఆటకు దొరికిన అద్భుతమైన రాయబారివి. నీతో ఎన్నో మధుర జ్ఞాపకాలు పంచుకోవడం సంతోషంగా ఉంది. నువ్వు ఎప్పుడూ పెదాలపై నీ మార్క్ నవ్వుతో కనిపిస్తూ ఉంటావని నమ్ముతున్నా. ఆల్ ది బెస్ట్’’ అని చెప్పాడు. కొన్నిరోజుల క్రితం టెస్టు క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్న టేలర్.. తాజాగా వన్డే క్రికెట్‌కు కూడా వీడ్కోలు పలికాడు. దీంతో పూర్తిగా అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమయ్యాడీ వెటరన్.