రామన్నపేట, జనవరి 13 : ప్రతి ఒక్కరూ లైసెన్స్ కలిగి ఉండి మాత్రమే వాహనాలను నడపాలని సీఐ వెంకటేశ్వర్లు అన్నారు. మంగళవారం రామన్నపేట మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రిలో రహదారి భద్రత గురించి అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ.. బైకర్లు రోడ్డుపై ప్రయాణం చేసేటప్పుడు తప్పకుండా హెల్మెంట్ ధరించాలన్నారు. అలాగే డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఇన్సూరెన్స్ ను తప్పకుండా కలిగి ఉండాలన్నారు. మొబైల్ ఫోన్ మాట్లాడుతూ, మద్యం త్రాగి వాహనాలను నడపొద్దన్నారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, వార్డు మెంబర్, డాన్ బాస్కో స్కూల్ హెడ్ మాస్టర్ జానీ, సిబ్బంది ఎం.సురేందర్, ఏఎస్ఐ కమలాకర్, మల్లికార్జున్, సత్యనారాయణ, స్వామి, నరసింహ, ప్రవీణ్, కృష్ణమూర్తి పాల్గొన్నారు.