KTR | కేటీఆర్కు మరో అరుదైన గౌరవం.. కొలంబియా బిజినెస్ స్కూల్లో ప్రసంగించాలని ఆహ్వానం
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఆయన చేసిన అసాధారణ కృషిని, తెలంగాణను ప్రపంచపటంలో సమున్నత స్థాయిలో నిలిపిన తీరును గుర్తిస్తూ.. అంతర్జాతీయ వేదికలపై ఆయన ఆలోచనలను పంచుకోవాల్సిందిగా ఆహ్వానం అందింది.
KTR : బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన గౌరవం దక్కింది. బీఆర్ఎస్ హయాంలో మంత్రిగా ఆయన చేసిన అసాధారణ కృషిని, తెలంగాణను ప్రపంచపటంలో సమున్నత స్థాయిలో నిలిపిన తీరును గుర్తిస్తూ.. అంతర్జాతీయ వేదికలపై ఆయన ఆలోచనలను పంచుకోవాల్సిందిగా ఆహ్వానం అందింది. సాంకేతికత, పాలన, సుస్థిర అభివృద్ధి, పట్టణ అభివృద్ధి, ఆర్థిక వృద్ధిపై ఆయనకు ఉన్న లోతైన అవగాహన ప్రపంచవ్యాప్తంగా విద్యా, విధాన నిర్ణేత, వ్యాపార వేదికలపై బలమైన ముద్ర వేసింది.
ఈ క్రమంలో న్యూయార్క్ నగరంలోని కొలంబియా బిజినెస్ స్కూల్ (CBS) లో 2026 ఏప్రిల్ 4న జరగనున్న ‘21వ వార్షిక ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్ (IBC)’ లో ప్రసంగించాలని కేటీఆర్కు ఆహ్వానం అందించింది. ఈ సదస్సును నిర్వహించే విద్యార్థి విభాగం ‘సౌత్ ఆసియా బిజినెస్ అసోసియేషన్ (SABA)’ ఈ మేరకు ఆయనను ఆహ్వానించింది. భారతదేశ వ్యాపార, ఆవిష్కరణ, విధాన నిర్ణయ రంగాలపై మేధోమధనం జరిగే ప్రపంచంలోని అత్యున్నత వేదికలలో ‘ఇండియా బిజినెస్ కాన్ఫరెన్స్’ ఒకటి. గత 21 ఏళ్లుగా న్యూయార్క్లో నిర్వహిస్తున్న ఈ సదస్సు.. ప్రపంచ ఆర్థికవ్యవస్థలో భారతదేశం పోషిస్తున్న పాత్రపై చర్చించేందుకు ప్రభుత్వం, పరిశ్రమలు, విద్యాసంస్థలు, ప్రవాస భారతీయులకు ఒక వేదికగా నిలుస్తుంది.
2026 ఎడిషన్ కాన్ఫరెన్స్లో ‘జెరోధా’ వ్యవస్థాపకులు నిఖిల్ కామత్ ప్రధాన వక్తగా వ్యవహరించనున్నారు. గతంలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్, పాలో ఆల్టో నెట్వర్క్స్ సీఈఓ నికేష్ అరోరా, డ్రీమ్ 11 సహ వ్యవస్థాపకులు హర్ష్ జైన్ వంటి ప్రముఖులు ఈ వేదికపై ప్రసంగించారు. ఇటీవలే హార్వర్డ్ విశ్వవిద్యాలయంలో జరిగే ‘హార్వర్డ్ ఇండియా కాన్ఫరెన్స్’కు రావాలని కేటీఆర్కు ఆహ్వానం అందిన తరుణంలోనే, ఇప్పుడు కొలంబియా బిజినెస్ స్కూల్ నుండి కూడా ఆహ్వానం రావడం విశేషం. కేటీఆర్ నాయకత్వం, విజన్ పట్ల అంతర్జాతీయస్థాయిలో ఉన్న ఆసక్తికి ఇది నిదర్శనం.
గత ఏడాది కూడా కేటీఆర్ ఆక్స్ఫర్డ్ ఇండియా వీక్ సందర్భంగా ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ప్రసంగించి, తన స్పష్టమైన, ముందుచూపుతో కూడిన ప్రసంగంతో అందరి ప్రశంసలు అందుకున్నారు. కేటీఆర్ను ‘విశిష్ట వక్త’గా ఆహ్వానించడం తమకు దక్కిన గౌరవంగా భావిస్తున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రజా సేవలో ఆయన చేసిన కృషి, భారతదేశ అభివృద్ధి పథంలో ఆయన పోషించిన పాత్రను ఈ సందర్భంగా కొనియాడారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

