Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Car Hits Pothole, Crash Bus | ఒక కారు గుంతలో పడి అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆ కారు నుజ్జు కావడంతో పాటు దాని భాగాలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడ్డాయి. అందులో ప్రయాణించిన చిన్నారి సహా ఐదుగురు ఈ ప్రమాదంలో మరణించారు.
ముంబై: ఒక కారు గుంతలో పడి అదుపుతప్పింది. ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును వేగంగా ఢీకొట్టింది. దీంతో ఆ కారు నుజ్జు కావడంతో పాటు దాని భాగాలు చెల్లాచెదురుగా రోడ్డుపై పడ్డాయి. అందులో ప్రయాణించిన చిన్నారి సహా ఐదుగురు ఈ ప్రమాదంలో మరణించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. (Car Hits Pothole, Crash Bus) మహారాష్ట్రలోని బీడ్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పంధర్పూర్-ఖమ్గావ్ జాతీయ రహదారిలోని షిండేవాడి ఫాటా సమీపంలో వేగంగా వస్తున్న స్విఫ్ట్ కారు ఒక గుంతలో పడింది. దీంతో డ్రైవర్ కారుపై నియంత్రణ కోల్పోయాడు. ఈ నేపథ్యంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఆ కారు బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో అది పూర్తిగా నుజ్జునుజ్జు అయింది. కారు శిథిలాలు, బంపర్ ముక్కలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి.
కాగా, ఈ ప్రమాదం గురించి తెలుసుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికులతో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. కారులో ప్రయాణించిన చిన్నారితో సహా ఐదుగురు ఈ ప్రమాదంలో మరణించగా బస్సులోని ప్రయాణికులు సురక్షితంగా ఉన్నారు.
మరోవైపు మృతులను మజల్గావ్కు చెందిన ఒక కుటుంబ సభ్యులుగా పోలీసులు గుర్తించారు. దర్శనం కోసం తులజాపూర్కు వెళ్లి కారులో వారు తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్ట్మార్టం కోసం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ సంఘటన వల్ల హైవేపై భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడటంతో దానిని క్లియర్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

