24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో అపోహలు సృష్టించడమే లక్ష్యంగా వెలుగు దినపత్రిక రాజకీయ దురుద్దేశపూరిత కథనాన్ని ప్రచురించిందని బీఆర్ఎస్ తీవ్రంగా ఖండించింది.
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ప్రతిష్ఠను దెబ్బతీయడంతో పాటు, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన సాగునీటి ప్రాజెక్టులపై ప్రజల్లో అపోహలు సృష్టించడమే లక్ష్యంగా వెలుగు దినపత్రిక రాజకీయ దురుద్దేశపూరిత కథనాన్ని ప్రచురించిందని భారత రాష్ట్ర సమితి తీవ్రంగా ఖండించింది. అక్టోబర్ 17న మొదటి పేజీలో ప్రచురించిన ‘కేసీఆర్ ఫామ్‌హౌస్‌కు మళ్లిన కొండపోచమ్మ’ అనే తప్పుడు కథనాన్ని వెంటనే ఉపసంహరించుకొని, బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ, లీగల్ సెల్ ఇన్ఛార్జ్ సోమ భరత్ కుమార్ వెలుగు యాజమాన్యానికి, ఎడిటర్‌కు నోటీసులు జారీ చేశారు.
యాదాద్రి భువనగిరి జిల్లా సాగునీటి అవసరాలు, కొండపోచమ్మ సాగర్, కాలువల మార్గాలను కేసీఆర్ వ్యవసాయ క్షేత్రంతో ముడిపెడుతూ ప్రచురించిన ఈ కథనానికి అధికారిక ఆధారాలేమిటని బీఆర్ఎస్ ప్రశ్నించింది. సాగునీటి శాఖ రికార్డులను పరిశీలించారా? కాలువల వాస్తవ మార్గాలను ధ్రువీకరించారా? సంబంధిత అధికారుల నుంచి వివరణ తీసుకున్నారా? అన్న ప్రశ్నలకు సమాధానాలు లేకుండా సంచలనాత్మక శీర్షికలతో ఆరోపణలు ప్రచురించడం జర్నలిజం ప్రమాణాలకు విరుద్ధమని పేర్కొంది.
కేసీఆర్ పేరును ఉపయోగించుకొని వివాదాలు సృష్టించడం, బీఆర్ఎస్పై బురదజల్లడం, గత ప్రభుత్వం చేపట్టిన సాగునీటి ప్రాజెక్టులను అప్రతిష్ఠపాలు చేయడం ద్వారా రాజకీయ ప్రయోజనాలు పొందాలనే ప్రయత్నాలను ప్రజలు గమనిస్తున్నారని పార్టీ తెలిపింది. వార్తాపత్రికను రాజకీయ ప్రచారానికి వేదికగా మార్చి, పత్రికా స్వేచ్ఛ ముసుగులో నిరాధార ఆరోపణలు చేస్తే చూస్తూ ఊరుకునేది లేదని హెచ్చరించింది.
బీఆర్ఎస్ పత్రికా స్వేచ్ఛను గౌరవిస్తుందని, ప్రభుత్వాలను, రాజకీయ నాయకులను ప్రశ్నించే హక్కును సమర్థిస్తుందని స్పష్టం చేసింది. అయితే ఆ స్వేచ్ఛకు బాధ్యత కూడా ఉండాలని, వ్యక్తుల ప్రతిష్ఠను దెబ్బతీసే ఆరోపణలకు తగిన ఆధారాలు ఉండాలని పేర్కొంది. తెలంగాణ సాగునీటి రంగంపై వాస్తవాల ఆధారంగా చర్చించాల్సింది పోయి, రాజకీయ ప్రయోజనాల కోసం వార్తలను వక్రీకరించడం ప్రజలను తప్పుదోవ పట్టించడమేనని మండిపడింది.
వెలుగు యాజమాన్యం, ఎడిటర్ నోటీసులు అందిన 24 గంటల్లోగా వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలని, అందులో చేసిన ఆరోపణలకు ఆధారాలతో కూడిన వివరణ ఇవ్వాలని, కేసీఆర్ గారికి, బీఆర్ఎస్ పార్టీకి బేషరతుగా క్షమాపణ చెప్పాలని సోమ భరత్ కుమార్ డిమాండ్ చేశారు. క్షమాపణను మొదటి పేజీలో తగిన ప్రాధాన్యంతో ప్రచురించడంతో పాటు, డిజిటల్ వేదికలు, అధికారిక సామాజిక మాధ్యమ ఖాతాల్లోనూ వెల్లడించాలని నోటీసుల్లో స్పష్టం చేశారు.
గడువులోగా స్పందించకపోతే పరువు నష్టం సహా వర్తించే చట్టాల ప్రకారం సంబంధిత సంస్థ, వ్యక్తులపై న్యాయపరమైన చర్యలు చేపడతామని బీఆర్ఎస్ లీగల్ సెల్ హెచ్చరించింది. కేసీఆర్ ప్రతిష్ఠను దెబ్బతీసే ప్రచారాన్ని, తెలంగాణ సాగునీటి ప్రాజెక్టులపై రాజకీయ దుష్ప్రచారాన్ని పార్టీ ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోదని స్పష్టం చేసింది.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
BRS Denmark | తప్పుడు కథనాన్ని ప్రచురించిన వెలుగు పత్రిక యాజమాన్యం క్షమాపణ చెప్పాలి : బీఆర్ఎస్ డెన్మార్క్
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

