Viral Video | రాజస్థాన్ (Rajasthan)లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. చిరుత (leopard)తో ఓ ఆవు (Cow) పోరాటం చేసి.. చివరికి ప్రాణాలు నిలుపుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది.
రాజస్థాన్‌లోని కోటాలో ముకుంద్రా హిల్స్ టైగర్ రిజర్వు (Mukundara Hills Tiger Reserve)లో ఈ ఘటన చోటు చేసుకుంది. అడవిలోని కొలిపుర ప్రాంతంలో మేత కోసం వచ్చిన ఆవుపై ఓ చిరుత దాడి చేసింది. దాని మెడను గట్టిగా పట్టుకుంది. అయినా, ఆవు ఏమాత్రం వెనక్కితగ్గలేదు. చిరుత బారి నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. చిరుత ఎంత గట్టిగా పట్టుకున్నా ఆవు తగ్గేదేలే అన్నట్లు ప్రతిఘటించింది. చివరికి చేసేదేమీ లేక చిరుత వెనక్కి తగ్గింది. ఆవును వదిలిపెట్టి అడవిలోకి పారిపోయింది. దీంతో ఆ ఆవు ప్రాణాలు నిలిచాయి. ఈ దృష్యాలను అటుగా వెళ్తున్న వారు తమ కెమెరాల్లో బంధించి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్‌గా మారింది.
#kota
जब हालात तेंदुए जैसे खूंखार हों, तब भी इंसान (या बैल) झुकने से इनकार कर दे।
यही हौसला गुलामी तोड़ता है, अन्याय को ललकारता है और इतिहास बदल देता है।
याद रखो:
जो हार मान ले, वो पहले मरता है जो डट जाए, वही ज़िंदा रहता है। ✊ pic.twitter.com/iETHRooq46— B_L Bairwa (@BSSVERMA) January 13, 2026
Also Read..
Earthquake: ఉత్తరాఖండ్‌లో స్వల్ప భూకంపం.. రిక్టర్ స్కేల్‌పై 3.5 తీవ్రత
Trump Tariffs | ఇరాన్ ట్రేడింగ్‌పై ట్రంప్ టారిఫ్ బాదుడు.. భారత్‌పై మరో 25 శాతం సుంకం తప్పదా?
Canada | డబ్బులిస్తావా.. బుల్లెట్ దించాలా?.. కెనడాలో భారతీయులకు బెదిరింపు ఫోన్ కాల్స్