డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో ఇవాళ స్వల్ప భూకంపం(Earthquake) చోటుచేసుకున్నది. ఉదయం 7.25 నిమిషాలకు భూమి కంపించింది. భూకంప తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 3.5గా నమోదు అయ్యింది. సుమారు 10 కిలోమీటర్ల లోతులో భూమి వణికింది. భాగేశ్వర్ జిల్లా కేంద్రంగా భూకంపం సంభవించింది. నిద్రలేస్తున్న సమయంలో ఈ ఘటన జరగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురయ్యారు. తీవ్రమైన చలి ఉన్నా.. ప్రకంపనలు వస్తామేమో అన్న భయంతో ఇండ్లు విడిచి వచ్చారు. భూకంపం వల్ల జరిగిన నష్టాన్ని అధికారులు అంచనా వేస్తన్నారు. నేషనల్ సెంటర్ ఫర్ సెసిమాలజీ ప్రకారం ఆ భూకంప కేంద్రం భాగేశ్వర్. 10 కిలోమీటర్ల లోతులో భూమి కంపించడం వల్ల ప్రకంపనలు చాలా బలంగా వచ్చాయి. భాగేశ్వర్కు సుమారు 174 కిలోమీటర్ల దూరంలో ఉన్న రిషికేశ్, 185 కిలోమీటర్ల దూరంలో ఉన్న హరిద్వార్‌లోనూ ప్రకంపనలు నమోదు అయ్యాయి. హరిద్వార్, రిషికేశ్ ప్రాంతాల్లో జనం ఇండ్లనుంచి బయటకు పరుగుదీశారు.
EQ of M: 3.5, On: 13/01/2026 07:25:06 IST, Lat: 29.93 N, Long: 80.07 E, Depth: 10 Km, Location: Bageshwar, Uttarakhand.
For more information Download the BhooKamp App https://t.co/5gCOtjdtw0 @DrJitendraSingh @OfficeOfDrJS @Ravi_MoES @Dr_Mishra1966 @ndmaindia pic.twitter.com/CyMhElw1qW— National Center for Seismology (@NCS_Earthquake) January 13, 2026