T20 World Cup 2026 : భారత్, శ్రీలంక సంయుక్తంగా ఆతిథ్యమిస్తున్న పొట్టి ప్రపంచకప్ కోసం నెదర్లాండ్స్ (Netherlands) క్రికెట్ స్క్వాడ్‌ను వెల్లడించింది. గత సీజన్లో జట్టును నడిపించిన స్కాట్ ఎడ్వర్డ్స్ (Scott Edwards) కెప్టెన్‌గా 15 మందితో కూడిన బృందాన్ని ఎంపిక చేసింది. అనుభవజ్ఞులు, కుర్రాళ్లతో కలగలిసిన పటిష్టమైన స్క్వాడ్‌ను మెగా టోర్నీకి ఎంపిక చేశామని సెలెక్టర్లు తెలిపారు. వాండర్ మెర్వే,బస్ డె లీడే, మైఖేల్ లివిట్, జాచ్ లయన్ కాచెట్, 34 ఏళ్ల ఆల్‌రౌండర్ కొలిన్ అకెర్మన్ బ్యాటింగ్ భారాన్ని మోస్తారని హెడ్‌కోచ్ రియాన్ కుక్ (Ryan Cook) పేర్కొన్నాడు.
స్క్వాడ్ ప్రకటన సందర్భంగా హెడ్‌కోచ్ రియాన్ కుక్ మాట్లాడుతూ.. గతంలో వరల్డ్‌కప్‌లు ఆడిన అనుభవం మాకుంది. అంతేకాకుండా భారత్, శ్రీలంకలో ఈమధ్య ఆడాం. వరల్డ్‌కప్ గ్రూప్‌లోని అన్ని జట్లతో ఇటీవల ఆడడం కూడా మాకు కలిసి వస్తుందని నమ్ముతున్నామని అన్నాడు. ‘గత కొన్ని నెలలుగా మెగా టోర్నీకోసం మా జట్టు సన్నాహకాలు అద్భుతంగా సాగుతున్నాయి. ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది జట్టును గెలిపించేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మా స్క్వాడ్‌లో అనుభవంతో పాటు ప్రతిభావంతులైన కుర్రాళ్లకు చోటిచ్చాం. గ్రూప్ దశలో మెరుగైన ప్రదర్శనతో ముందంజ వేస్తామనే నమ్మకముంది’ అని కుక్ వెల్లడించాడు.
Netherlands back their experienced core as they gear up for the #T20WorldCup 💪
Read more ➡️ https://t.co/NlpMDzZACE pic.twitter.com/JejArBpsw2
— ICC (@ICC) January 12, 2026
నెదర్లాండ్స్ స్క్వాడ్ : స్కాట్ ఎడ్వర్డ్స్(కెప్టెన్), కొలిన్ అకెర్మన్, నోహ్ క్రొఎస్, బస్ డి లీడే, ఫ్రెడ్ క్లాసెన్, కైలీ క్లెయిన్, మేఖైల్ లెవిట్, జాచ్ లయన్ కాచెట్, మ్యాక్స్ డోవ్డ్, లోగన్ వాన్ బీక్, టిమ్ వాన్ డెర్ గుట్కెన్, రోలొఫ్ వాన్‌డర్ మెర్వే, పాల్ వాన్ ముకెర్న్, సాఖిబ్ జుల్ఫికర్.
యూరోపియన్ క్వాలిఫయర్స్‌లో అదరొట్టిన నెదర్లాండ్స్ టీ20 ప్రపంచకప్ పోటీలకు అర్హత సాధింది. ఇదే క్వాలిఫయర్స్‌లో సంచలన ఆటతో ఇటలీ తొలిసారి మెగా టోర్నీ బెర్తు సాధించింది. గ్రూప్ ఏలో ఉన్న డచ్ జట్టు లీగ్ దశలో భారత్, నమీబియా, యూఎస్ఏ, పాకిస్థాన్‌తో తలపడనుంది. ఫిబ్రవరి 7న కొలంబోలో పాకిస్థాన్‌తో తొలి మ్యాచ్ ఆడనుంది ఎడ్వర్డ్స్ బృందం.