నిజామాబాద్: నిజామాబాద్ (Nizamabad) జిల్లా కోటగిరి మండల కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. సోమవారం రాత్రి కోటగిరిలో భారీ వర్షం కురిసింది. దీంతో పాత ఇల్లు గోడ కూలి తండ్రి కూతురు మృతి చెందారు. గ్రామానికి చెందిన మహేశ్ (24) తన భార్య, నెలన్నర కుమార్తెతో కలిసి ఇంట్లో నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో భారీ వర్షానికి ఇంటిగోడ కూలిపోయింది. దీంతో మహేశ్‌తోపాటు చిన్నారని అక్కడికక్కడే మృతిచెందారు. చిన్నారి తల్లి తీవ్రంగా గాయపడటంతో స్థానికులు ఆమెను దవాఖానకు తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించి, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.