Jurala Project | జూరాలకు భారీగా వరద.. 42 గేట్లు ఎత్తివేత
జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీగా వరద వస్తున్నది. ఎగువన వర్షాలు, జలాశయాల నుంచి నీటిని విడుదల చేయడంతో జూరాలకు 3.42 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది.
జూరాల: జోగులాంబ గద్వాల జిల్లాలోని జూరాల ప్రాజెక్టుకు (Jurala Project) భారీగా వరద వస్తున్నది. ఎగువన వర్షాలు, జలాశయాల నుంచి నీటిని విడుదల చేయడంతో జూరాలకు 3.42 లక్షల క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తున్నది. దీంతో అధికారులు 42 గేట్లు ఎత్తి 3.16 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 318.51 మీటర్లు. గరిష్ట నీటి నిల్వ సామర్థ్యం 9.657 టీఎంసీలు. ప్రస్తుతం 8.790 టీఎంసీలు ఉన్నది.
ఇక శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్‌కు వరద కొనసాగుతున్నది. ప్రాజెక్టుకు 3లక్షల57 వేల 333 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు 10 గేట్లను 5 అడుగుల మేర, 16 గేట్లను 10 అగుడుల మేర ఎత్తి అతే మొత్తంలో నీటిని విడుదల చేస్తున్నారు. ఎడమ, కుడి విద్యుత్ ప్లాంట్లలో కరెంటు ఉత్పత్తి కొనసాగుతున్నది. సాగర్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులు కాగా ప్రస్తుతం 586.70 అడుగులు ఉన్నది. ప్రాజెక్టులో మొత్తం 312 టీఎంసీల నీటిని నిల్వ చేయవచ్చు. ఇప్పుడు 303.94 టీఎంసీలు నిల్వ ఉన్నాయి.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Eyes Health | కళ్లకు సంబంధించి ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా.. అయితే జాగ్రత్త..
Fire Accident | క్రాకర్స్ షాపులోకి దూసుకెళ్లిన రాకెట్.. భారీగా ఎగిసిపడ్డ మంటలు.. వీడియో
Lal Krishna Advani: 100 ఏళ్ల ప్రాయంలోకి భారత రత్న ఎల్కే అద్వానీ !
KTR | నిరుపేద విద్యార్థికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ల్యాప్‌టాప్ అందజేత
KCR | అల్లం బుచ్చవ్వ మరణం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సంతాపం
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

