Chicken | భార్య చికెన్ (Chicken) వండలేదని భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆంధ్రప్రదేశ్లోని ప్రకాశం జిల్ల యర్రగొండపాలెం మండలంలో గోళ్లవిడిసిలో చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన కథనం ప్రకారం.. ఇంట్లో రోజూ పచ్చడి అన్నం పెడుతున్నదనదని ఇళ్ల లక్ష్మీనారాయణ (25) తన భార్యతో గొడవ పడ్డాడు. ఆదివారం కావడంతో చికెన్ తినాలని ఉందని చెప్పినా ఆమె వండకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురయ్యాడు.
దీంతో పొలానికి వెళ్లి అక్కడ చెట్టుకు ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. గుర్తించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వీరికి ఏడాదిన్నర బాబు ఉన్నాడు. మృతుడి తండ్రి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇలాంటి ఘటనే సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండలంలోని పోతారం గ్రామంలో జరిగింది. ఆదిలాబాద్ జిల్లాకు చెందిన దశరథ్ (40) అనే వ్యక్తి కుటుంబంతో పోతారం శివారులోని ఓ పౌల్ట్రీఫాంలో పనిచేస్తున్నాడు. అనారోగ్యంతో బాధపడుతున్న దశరథ్కు చికెన్ పెట్టొదని డాక్టర్లు సూచించారు. ఈ నేపథ్యంలో తనకు చికెన్ తినాలని ఉందని, కూర వండాలని భార్యను కోరాడు. అయితే డాక్టర్ వద్దని చెప్పాడని వారించడంతో ఇద్దరిమధ్య గొడవ జరిగింది. మనస్తాపానికి గురైన దశరథ్ వెంటనే పురుగుల మందు తాగి మృతిచెందాడు.