Akira Nandan | పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా, సుజీత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న హై ఎనర్జిటిక్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ “ఓజీ” విడుదలకు రెడీ అవుతోంది. సెప్టెంబర్ 25న థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్న ఈ చిత్రం మీద ఇప్పటికే భారీ హైప్ నెలకొంది. ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాలో పవన్ కుమారుడు అకిరా నందన్ కూడా నటించాడన్న ఊహాగానాలు మరింత జోరందుకున్నాయి.ఓజీ ఫస్ట్ సాంగ్ విడుదలైనప్పటి నుంచే కొంతమంది ఫ్యాన్స్, కొన్ని డిజైన్ డీటైల్స్, కళ్ల ఫోకస్ చూసి “ఇది అకిరా కళ్లే!” అని భావిస్తున్నారు. అయితే తాజాగా ఈ ఊహాగానాలను మరింత వేడెక్కించిన విషయం ఒకటి నెట్టింట వైరల్ అవుతుంది.
ఓజీ సినిమా ఆధారంగా రూపొందించిన ఓ ఆన్లైన్ గేమ్‌లో కనిపించిన ఓ యంగ్ కుర్రాడి కళ్లపై ఇప్పుడు హాట్ డిబేట్ నడుస్తోంది. ఆ కళ్ల రూపాన్ని గమనిస్తే అవి పవన్ కళ్యాణ్ కళ్ళు కావు. కానీ చాలా మందికి అవి అకిరా కళ్లే అని అనిపిస్తున్నాయి.ఇలాంటి లుక్స్, గేమ్ హింట్స్ చూస్తుంటే అకిరా నందన్ ఓజీ సినిమా ద్వారా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చాడా అనే అనుమానం మరింత బలపడుతోంది. గతంలోనూ కొన్ని ఓజీ ప్రోమో వీడియోలలో, ఫ్యాన్స్ కు అనుమానం వచ్చేలా కొన్ని యువకుల షాడోస్ కనిపించిన సంగతి తెలిసిందే.ఇక ఈ వార్తలు ఎంతవరకు నిజమో తెలియదు కాని అకిరా నిజంగానే ఓజీ చిత్రంలో ఉన్నాడా? లేదా అన్నది సినిమా రిలీజ్ అయితే కాని తెలియదు. ఒకవేళ ఇది నిజమైతే, పవన్ అభిమానులకు ఇది డబుల్ ట్రీట్ అవుతుంది.
ఇక గత కొన్ని రోజులుగా ‘ఓజీ’ ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తూ రాగా, సోమవారం ట్రైలర్ విడుదలైంది. ఓజాస్ గంభీర పాత్రలో పవన్‌కల్యాణ్ వింటేజ్ స్టైల్లో అదరగొట్టాడు. భారీ యాక్షన్ ఘట్టాలు, గ్రిప్పింగ్ డ్రామా కలబోతగా ట్రైలర్ ఆకట్టుకుంది. అజ్ఞాతవాసం అనంతరం ముంబయి మాఫియాలో ప్రత్యర్థులను ఖతం చేయడానికి నగరానికి తిరిగొస్తాడు ఓజాస్ గంభీర. ‘బాంబే వస్తున్నా..తలలు జాగ్రత్తా’ అంటూ ఓజాస్ గంభీర ఇచ్చిన వార్నింగ్ ట్రైలర్‌కి హైలైట్‌గా నిలిచింది.