నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): ఇన్నాళ్లు ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌పై ఉత్తర భాగంలోనే స్పష్టత ఉండగా గతనెల 29వ తేదీన హెచ్ఎండీఏ ఇచ్చిన ప్రాథమిక నోటిఫికేషన్‌తో దక్షిణ భాగంపైనా క్లారిటీ ఇచ్చినైట్లెంది. మొత్తం 8 జిల్లాల్లోని 33 మండలాల్లో 163 గ్రామాల మీదుగా రూపొందించిన ట్రిపుల్ ఆర్ అలైన్‌మెంట్‌పై ప్రాథమిక నోటిఫికేషన్ వెలువడింది.రెవెన్యూ గ్రామాల వారీగా సర్వేనెంబర్లుతో పాటు అలైన్మెంట్ నమూనా మ్యాప్‌ను కూడా వెల్లడించారు.
దీంతో ఒక్కసారిగా ట్రిపుల్ ఆర్ ప్రతిపాదించిన గ్రామాల్లో కలకలం మొదలైంది. సర్వేనెంబర్లు సైతం ప్రకటించడంతో బాధిత రైతు లు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. దీంతో గ్రామాల వారీ గా ట్రిపుల్ ఆర్కు వ్యతిరేకంగా బాధిత రైతులు నిరసనలకు దిగుతున్నారు. కోట్ల విలువైన పొలాలను ట్రిపుల్ఆర్కు ఇచ్చేదిలేదని తీర్మానాలు చేస్తున్నారు. ఇన్నాళ్లు ఉత్తర భాగం బాధితులే పోరాటంలో ఉండగా తాజాగా దక్షిణభాగం రైతులు తోడవడంతో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేయాలని సన్నద్ధం అవుతున్నారు.
ఓఆర్ఆర్కు అవుతల సుమారు 40 కిలోమీటర్లకు అటూఇటూగా రీజినల్ రింగ్‌రోడ్డు(ఆర్ఆర్ఆర్) నిర్మాణానికి ప్రభుత్వాలు సన్నాహాలు చేస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం ట్రిపుల్ఆర్ను ముందుకు తీసుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. అందులోభాగంగా గతంలోనే ఉత్తరభాగం అలైన్‌మెంట్‌ను ప్రకటించింది. తాజాగా ఇచ్చిన నోటిఫికేషన్లో ఇప్పటికే ప్రకటించిన ఉత్తర భాగం అలైన్మెంట్తోపాటు దక్షిణభాగం అలైన్మెంట్ వివరాలను వెల్లడించా రు.
ఉమ్మడి జిల్లా పరిధి తీసుకుంటే యాదాద్రి జిల్లా పరిధిలో సంస్థాన్ నారాయణపురం, చౌటుప్పల్, వలిగొండ, భువనగిరి, తుర్కపల్లి, యాదగిరిగుట్ట, నల్లగొండ జిల్లా పరిధిలో ఘట్టుప్పల్, మర్రిగూడ, చింతపల్లి మండలా పరిధిలోని 47గ్రామాల మీదుగా ట్రిపుల్ అలైన్‌మెంట్‌ను ప్రతిపాదిస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈ గ్రామాల్లోని వం దలాది ఎకరాల పంట భూములన్నీ ట్రిపుల్ ఆర్ రోడ్డు నిర్మాణంలో రైతులు కోల్పోవల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.
నోటిఫికేషన్ వెలువడిన మరుసటి రోజు నుంచే ట్రిపుల్ ఆర్ ప్రతిపాదిత గ్రామాల్లో తీవ్ర కలకలం మొదలైంది. సర్వే నెంబర్లు సైతం ప్రకటించడంతో ఆయా సర్వేనెంబర్లల్లోని రైతు కుటుంబాలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నాయి. ప్రతిపాదిత అలైన్మెంట్లో కొందరు రైతులు తమ పూర్తి భూమిని కోల్పోతుండడంతో ఆయా కుటంబాల్లో కంటిమీద కునుకు కరువైంది. ఇప్పటికే గ్రామాల వారీగా పలుచోట్ల స్వచ్ఛందంగా రోడ్లెక్కి ట్రిపుల్ ఆర్కు భూములు ఇవ్వబోమని స్పష్టం చేస్తున్నారు.
ఆందోళన బాట…
బాధిత రైతులంతా గ్రామాల వారీగా కమిటీలు ఏర్పడుతున్నారు. ఇందులో అన్నీ రాజకీయ పార్టీల నేతలతో పాటు రైతు సంఘాల నేతలను, బాధిత రైతులు ఉంటున్నారు. కోట్లాది రూపాయల విలువైన పంట భూములను ట్రిపుల్ఆర్ పేరుతో అడ్డికీ పావుసేరుకు సేకరిస్తామంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేస్తున్నారు. అందుకే అవసరం లేని ట్రిపుల్ ఆర్కు తమ భూములు ఇవ్వబోమని తీర్మానాలు సైతం చేస్తున్నారు. ఇప్పటికే సంస్థాన్ నారాయణపురంలోని ఆరు గ్రామాల రైతులంతా ఒక్కటై కమిటీగా ఏర్పడ్డారు. తహసీల్ కార్యాలయం ఎదుట ఆందోళనకు దిగారు.
శనివారం సర్వేల్లో బాధిత రైతులంతా ఏకమై కార్యాచరణ సిద్ధం చేశారు. పుట్టపాకలో అఖిలపక్ష రైతు సంఘాల ఆధ్వర్యంలో మునుగోడు-నారాయణపు రం రోడ్డుపై ఆందోళనకు దిగి రాకపోకలను అడ్డుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ భూములు ఇచ్చేది లేదని బాధిత రైతులు హెచ్చరించారు. సోమవారం చౌటుప్పల్ ఆర్డీవో కార్యాలయం ముట్టడితోపాటు హైవే దిగ్బంధనానికి కూడా సన్నాహాలు చేస్తున్నట్లు ప్రకటించారు. అదే రోజు దక్షిణ, ఉత్తర భాగానికి చెందిన బాధిత రైతులు పెద్ద సంఖ్యలో హైదరాబాద్‌లోని హెచ్ఎండీఏ కార్యాలయం ముట్టడికి కూడా సన్నద్ధం అవుతున్నారు. ఘట్టుప్పల్, మర్రిగూడ, చింతపల్లి మండలాల్లోని రైతులు సైతం ఆందోళనలకు సిద్ధమవుతున్నారు.
15 వరకు అభ్యంతరాలు
ఈనెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు అలైన్మెంట్ ప్రాథమిక నోటిఫికేషన్‌పై హెచ్ఎండీఏ అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇచ్చింది. దీంతో నిత్యం వందలాది మంది బాధిత రైతులు అమీర్‌పేటలోని హెచ్ఎండీఏ కార్యాలయానికి క్యూకడుతున్నారు. ఇదేసమయంలో గ్రామాల వారీగా దీనిపై అభ్యంతరాలు సమర్పిస్తున్నారు. ఇదే సమయంలో సర్వేనెంబర్ల వారీ గా బాదిత రైతులంతా ఎట్టి పరిస్థితుల్లో భూములు ఇవ్వబోమంటూ వ్యక్తిగతంగా రాతపూర్వక అభ్యంతరాలను అందజేస్తున్నారు. అభ్యంతరాల సమర్పణను సైతం తమ నిరసనలకు వేదికగా మార్చుకుంటున్నారు. అక్కడికి వెళ్లిన బాధిత రైతులం తా ట్రిపుల్ఆర్కు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. అక్కడే ఆందోళనకు దిగుతూ బైఠాయిస్తూ తమ వ్యతిరేకతను స్పష్టం చేస్తున్నారు.
శనివారంతో వినాయక నిమజ్జనం కూడా ముగియడంతో సోమవారం నుంచి రైతులు పెద్దసంఖ్యలో హెచ్ఎండీఏ కార్యాలయానికి తరలివెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. కొత్తగా ప్రకటించిన దక్షిణభాగం రైతులతో పాటు ఉత్తర భాగం రైతులు కూడా అభ్యంతరాలను తెలిపేందుకు ముందుకువస్తున్నారు. అభ్యంతరాల కోసం ఒక ఫార్మెట్‌ను రూపొందించి అందులో ప్రధాన డిమాండ్‌గా ట్రిపుల్ఆర్ను రద్దు చేయాలని పెట్టారు. లేనిపక్షంలో భూమికి బదులు భూమిని ఇవ్వాలని లేదా మార్కెట్ రేట్ ప్రకారం పరిహారం చెల్లిస్తూ బాధిత రైతు కుటుంబాల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని కోరారు. ఈ అభ్యంతరాల సమర్పణలో భాగంగా 15వ తేదీ వరకు హెచ్ఎండీఏ కార్యాలయం నిరసనలతో హోరెత్తే అవకాశం కనిపిస్తుంది. అభ్యంతరాల స్వీకరణ పూర్తయ్యాక రాజకీయ పక్షా ల కేంద్ర, రాష్ట్ర ప్రజాప్రతినిధులను కలిసి ట్రిపుల్ ఆర్‌పై తమ గోడును వినిపించాలని భావిస్తున్నారు. దశలవారీ ఆందోళనకు సిద్ధమని బాధితులంతా ముక్తకంఠంతో హెచ్చరిస్తున్నారు.