భూదాన్ పోచంపల్లి, సెప్టెంబర్ 06 : పేకాట ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు భూదాన్ పోచంపల్లి ఎస్ఐ కంచర్ల భాస్కర్ రెడ్డి తెలిపారు. మండలంలోని జలాల్పూర్ గ్రామానికి చెందిన నక్క శ్రీనివాస్ రెడ్డి, పోచంపల్లికి చెందిన పాలకుర్తి జంగయ్య, చెక్క నరేశ్, సామల సుధాకర్, కంది మహేందర్, ప్రశాంత్, పాలకూర్ల ఉపేందర్ ఈ ఏడుగురు జలాల్పూర్లోని నక్క శ్రీనివాస్ రెడ్డి గెస్ట్ హౌస్ నందు శనివారం సాయంత్రం పేకాట ఆడుతుండగా ఆకస్మిక రైడ్ చేసి పట్టుకున్నట్లు తెలిపారు. నిందితుల వద్ద నుండి రూ.25,570 నగదు, ఏడు మొబైల్ ఫోన్లు, నాలుగు సెట్ల పేకాలను స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు.