ఖైరతాబాద్, సెప్టెంబర్ 6 : ఖైరతాబాద్‌లో నవరాత్రుళ్లు పూజలందుకున్న శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జన ఘట్టం పూర్తయ్యింది. అయితే ముఖ్యమంత్రి పర్యటన నేపథ్యంలో నిమజ్జన ఏర్పాట్లలో కొంత ఆలస్యం జరిగింది. శనివారం ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర.. 7.41 గంటలకు మొదలైంది. 11.48 గంటలకు ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నం.4 వద్దకు చేరుకున్నది. తుదిపూజలనంతరం మధ్యాహ్నం 1.45 గంటలకు మహాగణపతి నిమజ్జనం సంపూర్ణమైంది.
ఖైరతాబాద్‌లో కొలువుదీరిన శ్రీ విశ్వశాంతి మహాశక్తి గణపతి నిమజ్జన ఘట్టం శుక్రవారం అర్ధరాత్రి నుంచే ప్రారంభమై, మరుసటి రోజు శనివారం మధ్యాహ్నం వరకు సాగింది.