ముంబై: భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)లో ఎన్నికల కోలాహలం మొదలైంది. ఈనెల 28న బోర్డు వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) జరుగనుంది. ఏజీఎంలో బీసీసీఐ అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు, సెక్రటరీ, జాయింట్ సెక్రటరీ, ట్రెజరర్, ఐపీఎల్ చైర్మన్ పదవులకు ఎన్నికలు జరుగనున్నాయి.
ముంబైలోని బీసీసీఐ కేంద్ర కార్యాలయంలో ఉదయం 11:30 గంటలకు ఈ సమావేశం ఉంటుందని బోర్డు ప్రధాన కార్యదర్శి దేవ్జిత్ సైకియా రాష్ర్టాల అసోసియేషన్లకు రాసిన లేఖలో పేర్కొన్నారు. ప్రస్తుతం బీసీసీఐ ఉపాధ్యక్షుడిగా ఉన్న రాజీవ్ శుక్లాకు బోర్డు అధ్యక్షుడిగా అయినా లేదంటే ఐపీఎల్ చైర్మన్గా ఎన్నికయ్యే అవకాశమున్నట్టు బోర్డు వర్గాల వినికిడి.