Toshiba | ప్రపంచ వ్యాప్తంగా లేఆఫ్స్ పర్వం (Lay Offs) కొనసాగుతోంది. ఆర్థిక మాంద్యం భయాందోళనల కారణంగా ఖర్చు తగ్గింపులో భాగంగా పలు సంస్థలు ఎడాపెడా ఉద్యోగులను తొలగించేస్తున్నాయి (job Cuts). తాజాగా జపాన్ (Japan)కు చెందిన అతిపెద్ద సంస్థ తోషిబా (Toshiba) తాజాగా ఉద్యోగుల తొలగింపునకు సిద్ధమైంది.
సుమారు 5,000 మందికి తొలగించాలని యోచిస్తున్నట్లు నిక్కీ నివేదించింది. ఇది సంస్థలోని మొత్తం ఉద్యోగుల్లో పది శాతానికి సమానం. టోక్యోకు చెందిన ఈ సంస్థ నాన్కోర్ వ్యాపారాలను తగ్గించడం ద్వారా తన కార్యకలాపాలను క్రమబద్ధీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు నిక్కీ నివేదించింది. కాగా, జపాన్లో ఉద్యోగుల తొలగింపులు చాలా అరుదు. కానీ, ఈ మధ్య కాలంలో పలు సంస్థలు పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగించాయి.
Also Read..
UNSC | భద్రతా మండలిలో భారత్కు శాశ్వత సభ్యత్వం.. ఎలాన్ మస్క్ ప్రతిపాదనపై స్పందించిన అమెరికా
Google | గూగుల్లో మరోసారి ఉద్యోగుల తొలగింపులు..!