UNSC | భద్రతా మండలిలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం.. ఎలాన్ మస్క్ ప్రతిపాదనపై స్పందించిన అమెరికా
UNSC | ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (United Nations Security Council)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం (Permanent Seat)పై అమెరికన్ టైకూన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ఇటీవలే ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది.
UNSC | ప్రపంచ శాంతి స్థాపనే లక్ష్యంగా ఏర్పాటైన ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (United Nations Security Council)లో భారత్‌కు శాశ్వత సభ్యత్వం (Permanent Seat)పై అమెరికన్ టైకూన్, టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ (Elon Musk) ఇటీవలే ప్రస్తావించిన విషయం తెలిసిందే. ఈ అంశంపై అగ్రరాజ్యం అమెరికా తాజాగా స్పందించింది. మస్క్ ప్రకటనపై బుధవారం మీడియా అడిగిన ప్రశ్నలకు అమెరికా విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి వేదాంత్ పటేల్ (Vedant Patel) స్పందించారు. భద్రతా మండలి సహా ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థల్లో సంస్కరణలకు అమెరికా అనుకూలమేనని తెలిపారు. ఐరాసలో సంస్కరణలపై అధ్యక్షుడు బైడెన్ గతంలో మాట్లాడారని, విదేశాంగ మంత్రి కూడా అందుకు మద్దతిచ్చినట్లు గుర్తు చేశారు. ఐరాసలో ప్రాతినిధ్యం 21వ శతాబ్దపు ప్రపంచాన్ని ప్రతిబింబించేలా ఉండాలని ఈ సందర్భంగా ఆయన వ్యాఖ్యానించారు.
కాగా, ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి (United Nations Security Council)లో శాశ్వత సభ్యత్వం (Permanent Seat) కోసం భారత్ ( India) దశాబ్దాలుగా పోరాటం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ దిశగా ప్రధాని మోదీ ప్రపంచ దేశాల మద్దతు కూడగడుతున్నారు. ఇప్పటికే పలు దేశాలు భారత్ ( India)కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం కోసం మద్దతు ప్రకటించాయి. అయితే, భారత్ ప్రయత్నాలకు చైనా వంటి దేశాలు మోకాలడ్డుతున్నాయి. ఈ నేపథ్యంలో ఐరాసలో భారత్‌కు శాశ్వత సభ్యత్వం లేకపోవడంపై అమెరికన్ టైకూన్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ (Elon Musk) ఈ ఏడాది జనవరిలో ప్రస్తావించారు. ఈ మేరకు ఐరాస విధానాలను తీవ్రంగా తప్పుబట్టారు.
ఈ భూమ్మీద అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ ఉన్నప్పటికీ.. భద్రతా మండలిలో ఆ దేశానికి శాశ్వత సభ్యత్వం లేకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. ఈ మేరకు ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరమన్నారు. ‘ఐరాస, దాని అనుబంధ సంస్థల్లో మార్పులు అవసరం. ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన భారత్‌కు భద్రతా మండలిలో శాశ్వత సభ్యత్వం లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. శక్తిమంతమైన దేశాలు తమ స్థానాలను వదులుకునేందుకు ఇష్టపడట్లేదు. ఇదే సమస్యకు కారణమవుతోంది. ఆఫ్రికా యూనియన్‌కు సమష్టిగా ఒక శాశ్వత సభ్యత్వం ఇవ్వాలి’ అంటూ తన అభిప్రాయాన్ని ఎక్స్ వేదికగా వెల్లడించారు. ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఆంటోనియో గుటెర్రస్ ట్వీట్ పై మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు.
కాగా, భద్రతా మండలిలో భారత్‌కు సాధారణ సభ్యత్వం మాత్రమే ఉంది. భద్రతా మండలిలో ప్రస్తుతం చైనా, అమెరికా, యూకే, ఫ్రాన్స్, రష్యా దేశాలు శాశ్వత సభ్య దేశాలుగా కొనసాగుతున్నాయి. ఈ ఐదు దేశాలకు ప్రత్యేకంగా వీటో పవర్ ఉంటుంది. మండలి సమావేశాలలో తీసుకున్న నిర్ణయాలను ఈ ఐదు దేశాల్లో ఏ ఒక్క దేశం అభ్యంతరం వ్యక్తం చేసినా సరే ఆ నిర్ణయం వీగిపోతుంది. శాశ్వత సభ్యత్వం కోసం భారత్ చేస్తున్న ప్రయత్నాలకు ఈ ఐదింటిలో నాలుగు మద్దతు ఇస్తున్నా.. చైనా మాత్రం భారత్ ప్రయత్నాలకు అడ్డుపడుతోంది.
Also Read..
Google | గూగుల్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపులు..!
Sri Ram Navami | బెంగాల్లో శ్రీరామ నవమి శోభాయాత్రపై దాడి.. ముర్షిదాబాద్‌లో 144 సెక్షన్
Read Today's Latest International News in Telugu and Telugu News
- Tags
- Elon Musk
- India
- UNSC
- Vedant Patel
RELATED ARTICLES
తాజా వార్తలు
Ranbir Kapoor | హైదరాబాద్‌కు రావడం ఎప్పుడూ ప్రత్యేకమే.. తెలుగులో మాట్లాడిన రణ్‌బీర్!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
China Restrictions | కీలక యంత్రాల ఎగుమతులపై చైనా కొత్త ఆంక్షలు
Godavari Waters | వందలాది టీఎంసీల నీళ్లు వృధా.. కరువు సాకుతో రైతుల పొట్ట కొడుతున్న కాంగ్రెస్ సర్కార్
Prashanth Neel | భయపెట్టేందుకు వస్తున్న ప్రశాంత్ నీల్ ‘418’.. ఆసక్తికరంగా ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

