Imran Khan | నా భార్యకు ఏమైనా జరిగితే వదిలిపెట్టను.. పాక్ ఆర్మీ చీఫ్‌కు ఇమ్రాన్ స్ట్రాంగ్ వార్నింగ్
Imran Khan | తన భార్య బుష్రా బీబీ (Bushra Bibi) జైలుకు వెళ్లడానికి ఆర్మీ చీఫ్ (Army Chief) జనరల్ అసిమ్ మునీరే (Asim Munir) కారణమని పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆరోపించారు.
Imran Khan | తన భార్య బుష్రా బీబీ (Bushra Bibi) జైలుకు వెళ్లడానికి ఆర్మీ చీఫ్ (Army Chief) జనరల్ అసిమ్ మునీరే (Asim Munir) కారణమని పాకిస్థాన్ మాజీ ప్రధాన మంత్రి, పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ (Imran Khan) ఆరోపించారు. బుష్రా బీబీ ఓ అవినీతి కేసులో దోషిగా తేలి శిక్ష అనుభవిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆమె ఇస్లామాబాద్ శివారులోని తన నివాసంలో గృహనిర్బంధంలో ఉన్నారు.
ఈ మేరకు ఆర్మీ చీఫ్ జనరల్‌కు ఇమ్రాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. గృహ నిర్బంధంలో ఉన్న తన భార్య బుష్రా బీబీకి ఏమైనా జరిగితే సహించేది లేదని హెచ్చరించారు. ‘నా భార్య బుష్రా బీబీకి శిక్ష పడటానికి జనరల్ అసిమ్ మునీరే కారణం. బుష్రా బీబీకి శిక్ష విధించిన న్యాయమూర్తి నాతో మాట్లాడారు. తీర్పు విషయంలో తనపై ఒత్తిడి ఉండేదని చెప్పారు. నా భార్యకు ఏదైనా జరిగితే అసిమ్ మునీర్‌ను సహించేది లేదు. నేను బతికున్నంత వరకూ అసిమ్ మునీర్‌ను వదిలి పెట్టను. అతడి రాజ్యాంగ విరుద్ధమైన, అక్రమ చర్యలను బయటపెడతా’ అని ఇమ్రాన్ వార్నింగ్ ఇచ్చాడు.
కాగా, గృహ నిర్బంధంలో ఉన్న తన భార్యను చంపేందుకు కుట్ర జరుగుతోందని ఇమ్రాన్ ఇటీవలే తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తన భార్యపై విషప్రయోగం జరిగినట్లు ఇమ్రాన్ ఆరోపించారు. అందుకు ఆధారాలున్నాయని జడ్జికి తెలియచేశారు. తన భార్యను ప్రైవేట్ నివాసంలో నిర్బంధించారని, దానిని సబ్జైల్గా మార్చారని పేర్కొన్నారు. ఆమెకు ఏమైనా జరిగితే ఆర్మీ చీఫ్ బాధ్యత వహించాలన్నారు. కాగా, ఇమ్రాన్ భార్య బుష్రా మాట్లాడుతూ తాను అమెరికన్ ఏజెంట్ అని పుకార్లు పుట్టించారని, తన ఆహారంలో టాయిలెట్ క్లీనర్ కలిపారని ఆరోపించారు.
Also Read..
Google | గూగుల్‌లో మరోసారి ఉద్యోగుల తొలగింపులు..!
Doxing | డాక్సింగ్తో మనకు తెలియకుండానే మన ప్రైవేట్ సమాచారం బజారులో..
Lok Sabha Elections | నాలుగో విడుత ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదల.. 11 గంటల నుంచి నామినేషన్లు షురూ
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hyderabad | తాగునీరు వృథా చేస్తే ఊరుకోం.. జూబ్లీహిల్స్ పబ్‌కు రూ.20 వేల జరిమానా!
AP News | ఏపీ మున్సిపల్ ఎన్నికలు.. ముగిసిన నామినేషన్ల గడువు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

