Doxing | డాక్సింగ్తో మనకు తెలియకుండానే మన ప్రైవేట్ సమాచారం బజారులో..
మీ వ్యక్తిగత లేదా మీ సంస్థకు సంబంధించిన గోప్యమైన సమాచారం మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా సామాజిక లేదా ఇతర మాధ్యమాల్లో వెల్లడైతే మీరు ఏం చేస్తారు? నేటి ఆధునిక సమాజంలో ముఖ్యంగా సెలబ్రిటీలు, సినీతారలు, రాజకీయ నేతలు, ప్రముఖ క్రీడాకారులు తరచూ ఈ సమస్య ఎదుర్కొంటున్నారు.
- నిరోధించడానికి భారత్‌లో చట్టాలు లేవంటున్న నిపుణులు
Doxing | న్యూఢిల్లీ, ఏప్రిల్ 17: మీ వ్యక్తిగత లేదా మీ సంస్థకు సంబంధించిన గోప్యమైన సమాచారం మీకు తెలియకుండా, మీ అనుమతి లేకుండా సామాజిక లేదా ఇతర మాధ్యమాల్లో వెల్లడైతే మీరు ఏం చేస్తారు? నేటి ఆధునిక సమాజంలో ముఖ్యంగా సెలబ్రిటీలు, సినీతారలు, రాజకీయ నేతలు, ప్రముఖ క్రీడాకారులు తరచూ ఈ సమస్య ఎదుర్కొంటున్నారు. ఇంటర్నెట్ పరిభాషలో ‘డాక్సింగ్’గా పిలిచే దీనికి అడ్డుకట్ట వేయడానికి భారత్‌లో ఎలాంటి చట్టాలు లేవు. ఒక మహిళ వ్యక్తిగత, వృత్తిగత సమాచారాన్ని సామాజిక మాధ్య మం ‘ఎక్స్’లోంచి తొలగించాలంటూ ఇటీవల ఢిల్లీ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ సమాచారం పబ్లిక్‌గా లభ్యం అవుతున్నందున దానిని ‘డాక్సింగ్’గా భావించలేమని పేర్కొంది. భారత చట్టాల్లో డాక్సింగ్‌కు నిర్వచనం లేదు. కాబట్టి దాన్ని చట్టబద్ధమైన నేరంగా పరిగణించలేమంటూ నిస్సహాయత వ్యక్తం చేసింది.
ఎలా పాల్పడతారు?
సాధారణంగా హానికరమైన ఉద్దేశంతోనే హ్యాకర్లు డాక్సింగ్‌కు పాల్పడుతుంటారు. ఇది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. సంబంధిత వ్యక్తుల ఫోన్ నెంబర్లు, ఇంటి చిరునామా, ఈ-మెయిల్ చిరునామాలు వెల్లడించ వచ్చు. మీ ఐడెంటిఫికేషన్ మార్క్సు, మీ ప్రైవేట్ పార్టుల గురించిన సమాచారం, మీ ఫొటోలు, మీ హాబీలు, మీ బలహీనతలు, మీ ఎత్తు, మీ రంగు, మీరు వాడే దుస్తులు, ఫలానా సమయంలో మీరు ఎక్కడ ఉన్నారు, ఏం చేశారు, ఎవరితో ఉన్నారు ఇలా ఏ సమాచారానైనా పబ్లిక్ డొమైన్లో పెట్టి సంబంధింత వ్యక్తులను బెదిరించడం, పరువు తీయడం, గౌరవానికి భంగం కలిగించడం వంటి చర్యలకు పాల్పడవచ్చు. సాధారణంగా ఈ హ్యాకర్లు ఈ సమాచారాన్ని ఐపీ చిరునామాలు, సామాజిక మాధ్యమాల ప్రొఫైల్స్, ఫొటోలు, బ్రోకర్ల నుంచి సేకరించిన డాటా, ఫిషింగ్ ప్రచారం, ఇంటర్నెట్ ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించడం ద్వారా కూడా సేకరిస్తూ ఉంటారు.
అడ్డుకోలేమా?
డాక్సింగ్ బాధితులు తమ సమాచారాన్ని హ్యాకర్లు ఎలాంటి సామాజిక మాధ్యమాల్లో ఉంచారో దానిని డాక్యుమెంట్ ఎవిడెన్స్‌గా చూపుతూ పోలీసులు లేదా సైబర్ క్రైమ్‌కు ఫిర్యాదు చేయాలి. అవసరమైతే న్యాయస్థానాలను కూడా ఆశ్రయించవచ్చు. మీ అకౌంట్‌ను లాక్ చేయాలి, మీ ఫోన్ నెంబర్లు మార్చడం మరో ప్రత్యామ్నాయం. కాగా, ఈ డాక్సింగ్‌కు సంబంధించి బాధితులు ఫిర్యాదు చేసే సౌకర్యాన్ని ఎక్స్ కల్పించింది. మీపై అభ్యంతరకరంగా ఉన్న సమాచారం, ఇమేజ్, వీడియోలను తొలగించమని మీరు ఎక్స్‌ను కోరవచ్చు. అయితే ఇవన్నీ తాత్కాలిక చర్యలు మాత్రమే. డాక్సింగ్ను నేరుగా నిరోధించే చట్టాలేవీ భారత్‌లో ఇంతవరకు లేవు. అయితే వాయోరిజం, ఐటీ చట్టాల కింద హ్యాకర్లను కొంతమేరకు అడ్డుకోవచ్చు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mokshagna | మోక్షజ్ఞ డెబ్యూ మూవీపై క్రేజీ అప్డేట్.. దర్శకత్వ బాధ్యతలు వశిష్ఠకే, జనవరి చివరి నుంచి షూటింగ్..
Firecrackers History | దీపావళికి బాణసంచా ఎలా వచ్చింది? చైనా నుంచి భారత్‌కు టపాసుల ప్రయాణం ఇదే!
Scene | బాక్సాఫీస్ వద్ద సూర్య ‘సీన్’ సెన్సేషన్.. రెండు రోజుల్లో 11.5 లక్షలకు పైగా టికెట్లు!
Diwali Celebrations | దేశంలో ఒక్కో ప్రాంతంలో ఒక్కోలా దీపావళి.. మనకు తెలియని పండుగ విశేషాలివే!
Janhvi Kapoor | కోలీవుడ్‌పై ఫోకస్ పెంచిన బాలీవుడ్ బ్యూటీ.. తమిళ సినిమాలపై ప్రశంసల వర్షం వెనుక అసలు కారణం ఇదేనా?
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

