డీల్ కుదిరినా.. కుదరకున్నా.. రఫాపై దాడి
దక్షిణ గాజాలోని రఫా నగరంపై తాము దాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు.
- ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు స్పష్టీకరణ
టెల్ అవీవ్, ఏప్రిల్ 30: దక్షిణ గాజాలోని రఫా నగరంపై తాము దాడి చేస్తామని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు స్పష్టం చేశారు. ఆరునూరైనా ఈ యుద్ధంలో విజయం సాధిస్తామని ప్రతిజ్ఞ చేశారు. మంగళవారం ఆయన మాట్లాడుతూ హమాస్‌తో కాల్పుల విరమణ చర్చలు కొనసాగుతున్న క్రమంలో దానిపై ఒప్పందం కుదరినా, కుదరకపోయినా.. హమాస్‌లను అంతం చేయడానికి ఇజ్రాయెల్ దళాలు రఫాలోకి ప్రవేశిస్తాయన్నారు.
కాగా, ఇజ్రాయెల్-హమాస్ యుద్ధం కారణంగా వేలాది మంది పాలస్తీనియన్లు రఫా నగరంలో ఆశ్రయం పొందుతున్నారు. ఈ క్రమంలో బందీల విడుదలకు, కొంత ఉపశమనం పొందడానికి రెండు దేశాల మధ్య కాల్పుల ఒప్పందంపై చర్చలు జరుగుతున్నాయి. అయితే ‘మా లక్ష్యాలను సాధించకుండా యుద్ధం నిలిపివేసే సమస్యే లేదు. మేము రఫాలోకి ప్రవేశిస్తాం. హమాస్ దళాలను పూర్తిగా తుడిచిపెట్టేస్తాం. కాల్పుల విరమణపై ఒప్పందం జరిగినా, జరగకపోయినా ఈ యుద్ధంలో పూర్తి విజయం సాధిస్తాం’ అని నెతన్యాహూ పేర్కొన్నారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

