ఆదిలాబాద్, ఫిబ్రవరి 14(నమస్తే తెలంగాణ) : ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ ఘోర పరాజయాన్ని చవిచూసింది. మున్సిపాలిటీ పరిధిలో 49 వార్డుల్లో పోటీ చేసిన కాంగ్రెస్ పార్టీ కేవలం పదకొండు స్థానాల్లో మాత్రమే విజయం సాధించింది. పలు వార్డుల్లో హస్తం పార్టీ మూడో స్థానానికి పరిమితమైంది. టికెట్ల పంపిణీ నుంచి ఆ పార్టీలో వర్గ విభేదాలు బహిర్గతమయ్యా. గతంలో ఇతర పార్టీల నుంచి హస్తం పార్టీలో చేరిన సిట్టింగ్ కౌన్సిలర్లు తమకు టికెట్ వస్తుందని ఆశతో ఉండగా.. గ్రూపు రాజకీయాలతో ఆశావహులకు టికెట్లు దక్కలేదు. దీంతో పలు వార్డుల్లో వారి రెబల్స్‌గా పోటీ చేశారు.
ప్రభుత్వ సలహాదారు, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్‌రెడ్డి సమక్షంలో టికెట్లను ఫైనల్ చేయగా, కొందరు నాయకులు ఆయనను పక్కదారి పట్టించి తమ వారికి టికెట్లు ఇప్పించారనే చర్చ జరిగింది. టికెట్లు ఆశించిన రాని వారు నాయకులపై తీవ్ర ఆరోపణలు చేశారు. డబ్బులకు టికెట్లు అమ్ముకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకులు రెండు సంవత్సరాలుగా కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలతో విస్తృతంగా ప్రచా రం నిర్వహించిన ప్రజలు తిరస్కరించారు.
ఆదిలాబాద్ మున్సిపాలిటీ ఎన్నికల్లో తక్కువ సీట్లు దక్కడంతో పార్టీ నాయకులు తీవ్ర నిరాశకు గురయ్యారు. చైర్మ న్ సీటుపై కన్నేసిన కాంగ్రెస్ నాయకులు ఫలితాలకు ముం దుగానే తమ అభ్యర్థులతో వాహనాల్లో ఇతర ప్రాంతాలకు తరలించారు. తీరా 11 సీట్లు రావడంతో ఏమి చేయలేని పరిస్థితులు నెలకొన్నాయి. పలు వార్డుల్లో సిట్టింగ్ కౌన్సిలర్లుకౌన్సిలర్లు ఓడిపోయారు. దీంతో క్యాడర్లో తీవ్ర ని రుత్సాహం నెలకొన్నది. తాము విజయం పక్కగా గెలుస్తా మనుకున్న వార్డుల్లో ప్రజలు ఆదరించక పోవడంతో నాయకులకు ఏమి చేయాలో పాలుపోవడం లేదు.