Results | 2024 సంవత్సరానికి గానూ ఐసీఎస్ఈ 10వ తరగతి, ఐఎస్సీ 12వ తరగతి ఫలితాలను కౌన్సిల్ ఫర్ ది ఇండియన్ స్కూల్ సర్టిఫికేట్ ఎగ్జామినేషన్స్ (Council for the Indian School Certificate Examinations) సోమవారం విడుదల చేసింది. ఈ ఏడాది మొత్తం ఐసీఎస్ఈ క్లాస్ 10 పరీక్షకు 2,43,617 మంది హాజరుకాగా, వీరిలో 2,42,328 మంది పాస్ అయ్యారు. ఇక ఐఎస్సీ క్లాస్ 12 పరీక్ష రాసిన 99,901 మంది విద్యార్థుల్లో 98,088 మంది ఉత్తీర్ణులయ్యారు.
ఇక ఐసీఎస్ఈ 10 ఫలితాల్లో బాలుర కంటే బాలికలే పైచేయి సాధించారు. బాలికలు 99.65 శాతం ఉత్తీర్ణత సాధించగా.. బాలురు 99.31 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇక ఐఎస్సీ 12 ఫలితాల్లో బాలికలు 98.92 శాతం, బాలురు 97.53 శాతం ఉత్తీర్ణత శాతం సాధించారు. ఆయా విద్యార్థులు తమ ఫలితాలను results.cisce.org, cisc.org వెబ్‌సైట్స్‌లో తనిఖీ చేసుకోవచ్చు.
ICSE: Girls have done better than Boys, pass percentage-99.65%, Boys pass percentage-99.31%
ISC: Girls have achieved a pass percentage of 98.92%, Boys- 97.53%
— ANI (@ANI) May 6, 2024
Also Read..
Amethi | అమేథిలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి.. కార్లు ధ్వంసం
ED Raids | రాంచీలో ఈడీ దాడులు.. మంత్రి వ్యక్తిగత సహాయకుడి ఇంట్లో కట్టలు కట్టలుగా బయటపడ్డ నగదు
Brazil | బ్రెజిల్లో వర్ష బీభత్సం.. వరదల ధాటికి 78 మంది మృతి