సిటీబ్యూరో, మే 18 (నమస్తే తెలంగాణ): బంగాళాఖాతంలో ఏర్పడిన ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో గ్రేటర్లోని పలు చోట్ల శనివారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. రాత్రి 10 గంటల వరకు లింగంపల్లిలో అత్యధికంగా 6.88 సెం.మీలు, చందానగర్లో 5.80, హస్తినాపురంలో 5.68, వనస్థలిపురంలో 5.0, నాచారం, రామంతాపూర్లో 4.78, రామచంద్రాపురం, బీహెచ్ఈఎల్లో 4.60, నాగోల్, అల్కాపురి కాలనీ, సరూర్నగర్లో 4.50 సెం.మీల చొప్పున వర్షపాతం నమోదైనట్లు టీఎస్డీపీఎస్ అధికారులు వెల్లడించారు.
ఆవర్తనం, అల్పపీడనం ప్రభావంతో రాగల మరో రెండు రోజులు గ్రేటర్లోని అనేక ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. శనివారం ఉదయం నుంచి రాత్రి వరకు నగరంలో గరిష్ఠం 32.8, కనిష్ఠం 24.5 డిగ్రీలు, గాలిలో తేమ 69 శాతంగా నమోదైనట్లు పేర్కొంది.