న్యూఢిల్లీ: టైప్-2 డయాబెటిస్తో బాధపడేవారు మందార పువ్వుతో తయారు చేసిన టీ లేదా నీళ్లు తాగడం వల్ల మంచి ఫలితాలను పొందవచ్చునని న్యూట్రిషనిస్ట్, డిజిటల్ క్రియేటర్ చైర్మన్ హా డొమిన్గెజ్ చెప్పారు. ఈ టీ లేదా వాటర్‌లో పంచదార కలపకూడదని తెలిపారు. దీనిలో యాంటీఆక్సిడెంట్లు, విటమిన్-సీ పుష్కలంగా ఉన్నాయని చెప్పారు.
ప్రముఖ న్యూట్రిషనిస్ట్ శుభ రమేశ్ మాట్లాడుతూ… మందార పువ్వు వల్ల టైప్-2 డయాబెటిస్ తగ్గుతుందని చెప్పడానికి కచ్చితమైన ఆధారాలు లేవన్నారు. అయితే బ్లడ్ షుగర్ లెవెల్స్‌ను మేనేజ్ చెయ్యడంలో మందార పువ్వు ఉపయోగపడుతుందని కొన్ని అధ్యయనాలు వెల్లడించాయన్నారు. మందార పువ్వులోని ఆర్గానిక్ యాసిడ్స్, ఫ్లేవనాయిడ్స్, యాంథోసయనిన్స్ డయాబెటిస్ మేనేజ్మెంట్కు ఉపయోగపడతాయని చెప్పారు.