ED Raids | జార్ఖండ్ (Jharkhand) రాజధాని రాంచీ (Ranchi)లోని పలు ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (Enforcement Directorate) అధికారులు సోమవారం వరుస దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో లెక్కల్లో చూపని సుమారు రూ.25 కోట్ల నగదును గుర్తించి స్వాధీనం చేసుకున్నారు.
జార్ఖండ్ గ్రామీణాభివృద్ధి శాఖలో (Jharkhand Rural Development) కొన్ని పథకాల అమలులో అవకతవకలు జరగడంతో మనీ లాండరింగ్ కేసు నమోదైంది. ఈ వ్యవహారంలో గతేడాది ఫిబ్రవరిలో ఆ శాఖ చీఫ్ ఇంజనీర్ వీరేంద్ర రామ్‌ను ఈడీ అరెస్టు చేసింది. తాజాగా ఈ కేసుకు సంబంధించి ఈడీ అధికారులు ఇవాళ రాంచీలోని సుమారు 10 ప్రాంతాల్లో ఏకాలంలో వరుస దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రాష్ట్ర గ్రామీణాభివృద్ధి మంత్రి ఆలంగీర్ ఆలం (Alamgir Alam) వ్యక్తిగత సహాయకుడు సంజీవ్ లాల్ నౌకర్ ఇంట్లో కట్టలు కట్టలుగా నగదు బయటపడింది. పట్టుబడిన నగదు విలువ సుమారు రూ.25కోట్లకు పైగానే ఉంటుందని అంచనా. ప్రస్తుతం ఇతర ప్రాంతాల్లో ఈడీ అధికారులు సోదాలు కొనసాగిస్తున్నారు.
#WATCH | The Enforcement Directorate is conducting raids at multiple locations in Ranchi. Huge amount of cash recovered from household help of Sanjiv Lal – PS to Jharkhand Rural Development minister Alamgir Alam, in Virendra Ram case.
ED arrested Virendra K. Ram, the chief… pic.twitter.com/VTpUKBOPE7
— ANI (@ANI) May 6, 2024
Also Read..
Terrorist Attack | పూంచ్ ఉగ్రదాడిలో కీలక విషయాలు..! సూత్రధారి అతడేనా..?
Israel Air Strikes | రఫాపై ఇజ్రాయెల్ దాడి.. 16 మంది పాలస్తీనియన్లు మృతి
MBBS Student | నీట్ యూజీ.. అభ్యర్థికి బదులు పరీక్ష రాస్తూ పట్టుబడ్డ ఎంబీబీఎస్ స్టూడెంట్