Terrorist Attack | పూంచ్ ఉగ్రదాడిలో కీలక విషయాలు..! సూత్రధారి అతడేనా..?
Terrorist Attack | సూరన్‌కోట్ ప్రాంతంలో వాయుసేన కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడి ఘటనలో పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు మెరుపుదాడి చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
Terrorist Attack | సూరన్‌కోట్ ప్రాంతంలో వాయుసేన కాన్వాయ్‌పై జరిగిన ఉగ్రదాడికి సంబంధించి కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దాడి ఘటనలో పాక్ ఉగ్రవాద సంస్థ లష్కరే తోయిబా హస్తం ఉన్నట్లు సమాచారం. ఈ దాడిలో ముగ్గురు నుంచి నలుగురు ఉగ్రవాదులు మెరుపుదాడి చేసినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జమ్మూ కశ్మీర్‌లోని సరిహద్దు జిల్లా రాజౌరీ-పూంచ్‌లో ఉగ్రవాద ఘటనలు నిర్వహిస్తున్న అబూ హమ్జా ఈ దాడికి ప్రధాన సూత్రధారిగా అనుమానిస్తున్నారు.
సైన్యానికి నష్టం కలిగించే లక్ష్యంతో దాడిలు ఉక్కు బుల్లెట్లను ప్రయోగించారు. దాడి ఘటనకు ఇప్పటి వరకు ఏ ఉగ్రసంస్థ బాధ్యత వహించలేదు. అదే సమయంలో ఆదివారం రెండో రోజు సైతం ఉగ్రవాదుల కోసం వేట కొనసాగింది. 20 కిలోమీటర్ల పరిధిలో ఉగ్రవాదులను చుట్టుముట్టి వారిని గుర్తించే పనిలో భద్రతా బలగాలు నిమగ్నమయ్యాయి. హెలికాప్టర్లు, డ్రోన్లు, డాగ్ స్క్వాడ్, పారా కమాండోలను సెర్చ్ ఆపరేషన్‌లో మోహరించారు. ఈ క్రమంలో అనుమానాస్పదంగా ఆరుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
ఉగ్రవాదులు ఏకే అసాల్ట్ రైఫిల్స్‌తో పాటు అమెరికాలో తయారు చేసిన ఎం4 కార్బైన్లు, స్టీల్ బుల్లెట్లను కూడా ఉపయోగించి గరిష్ఠంగా ప్రాణనష్టం చేసేందుకు ప్రయత్నించినట్లుగా ప్రాథమిక విచారణలో వెల్లడైంది. దాడి అనంతరం ఉగ్రవాదులు పారిపోయి అటవీప్రాంతంలో దాక్కున్నారు. జమ్మూ కశ్మీర్ ఐజీపీ ఆనంద్ జైన్, ఆర్మీ సీనియర్ అధికారులు, ఇంటెలిజెన్స్ ఏజెన్సీలు సంఘటనా స్థలాన్ని సందర్శించారు. ఉగ్రవాదులను మట్టుబెట్టేందుకు షాసితార్, గుర్సాయ్, సనాయ్, షీందారా టాప్ సహా పలు ప్రాంతాల్లో సైన్యం, పోలీసుల సంయుక్త ఆపరేషన్ కొనసాగుతోందని అధికారులు వివరించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Yaba Tablets | అస్సాంలో రూ.10 కోట్ల విలువైన డ్రగ్స్ పట్టివేత..!
Indian Army launches Bharat Rice | రక్షణ దళాల కోసం ‘భారత్ రైస్’.. ఎఫ్‌సీఐతో ఆర్మీ ఒప్పందం
Ganja Chocolates | కరీంనగర్ జిల్లాలో గంజాయి చాక్లెట్స్ కలకలం
Rahul Gandhi | ఓట్ల దొంగతనంలో సీఈసీ ప్రధాన నేరస్థుడు కాదు : రాహుల్‌గాంధీ
Infections | శరీరంలో ఇన్ఫెక్షన్లు తీవ్రమైతే కనిపించే లక్షణాలు ఇవే.. వీటితో జాగ్రత్త..
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

