MBBS Student | నీట్ యూజీ.. అభ్యర్థికి బదులు పరీక్ష రాస్తూ పట్టుబడ్డ ఎంబీబీఎస్ స్టూడెంట్
రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో అభ్యర్థికి బదులు (Proxy Candidate) పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడో ఎంబీబీఎస్ విద్యార్థి (MBBS Student). దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జరిగింది.
జైపూర్: రాజస్థాన్‌లోని భరత్‌పూర్‌లో అభ్యర్థికి బదులు (Proxy Candidate) పరీక్ష రాస్తూ పట్టుబడ్డాడో ఎంబీబీఎస్ విద్యార్థి (MBBS Student). దేశవ్యాప్తంగా ఆదివారం నీట్ యూజీ ప్రవేశ పరీక్ష జరిగింది. భరత్పూర్ జిల్లా మథురాలో ఉన్న ఓ పరీక్ష కేంద్రంలో అంతా పరీక్ష రాస్తున్నారు. ఈ క్రమంలో పరీక్ష కేంద్రంలోని ఓ గదిలో అభ్యర్థికి బదులు మరొకరు పరీక్ష రాస్తున్నట్లు ఇన్విజిలేటర్ గుర్తించారు. వెంటనే అతడిని పోలీసులకు పట్టించారు.
విచారణ సందర్భంగా తన పేరు అభిషేక్ గుప్తా అని, ప్రభుత్వ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ చేస్తున్నాని చెప్పాడు. రాహుల్ గుర్జర్ అనే అభ్యర్థికి బదులు తాను పరీక్ష రాస్తున్నాని వెల్లడించాడు. దీనికోసం అతని నుంచి ఇప్పటికే రూ.10 లక్షలు తీసుకున్నామని తెలిపాడు. తనతోపాటు మరో ఐదుగురు ఉన్నారని, తన సహ విద్యార్థి రవి మీనా కోసంమే ఈ పనిచేస్తున్నట్లు పేర్కొన్నాడు. వారంతా పరీక్షా కేంద్రం సమీపంలో ఓకారులో ఉన్నారని పోలీసులకు చెప్పారు. దీంతో పరీక్ష రాయాల్సిన అసలు విద్యార్థి రాహుల్ గుర్జర్‌ను, ఈ రాకెట్ నడుపుతున్న మరో నలుగురిని అదుపులోకి తీసుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
AH Movie | ‘అ’ ఒక సరికొత్త మిస్టరీ థ్రిల్లర్: ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేయడం ఖాయమన్న హీరో రాహుల్ విజయ్!
Moinabad | డ్రగ్స్ తరలిస్తున్న ఇద్దరు అరెస్ట్.. 2 లక్షల విలువైన ఎండీఎంఏ స్వాధీనం..!
Karepalli | కారేపల్లి మండలంలో ఘనంగా ‘ఎంగిలిపూల బతుకమ్మ’ వేడుకలు..!
Hanumakonda | విజయ డెయిరీ అభివృద్ధి కోసం రూ.1.85 కోట్ల నిధులు మంజూరు..!
KTR | తెలంగాణ ఉద్యమకారుడి కుటుంబానికి అండగా కేటీఆర్.. 10 లక్షల ఆర్థిక సాయం అందజేత..!
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

