హైదరాబాద్, అక్టోబర్16 (నమస్తే తెలంగాణ): ప్రజారోగ్యం దృష్ట్యా మాంసం దుకాణాల్లో నాణ్యత ప్రమాణాల కోసం దేశవ్యాప్తంగా కేంద్రప్రభుత్వం కొత్త విధానాలను తీసుకొచ్చింది. మాంసం దుకాణాలు తప్పనిసరిగా లైసెన్స్ కలిగి ఉండాలనే నిబంధన ప్రవేశపెట్టింది. ఇది కేవలం వాణిజ్య పరిమి తి కాకుండా ప్రజా ఆరోగ్యం, నాణ్యతపై ప్ర భుత్వాల బాధ్యత అని కేంద్రం వెల్లడించిం ది.
కేంద్రం ఆదేశాల నేపథ్యంలో.. స్టెరాయిడ్లతో పెంచిన కోళ్ల విక్రయాలు, శానిటరీ ప్ర మాణాలు లేకపోవడం తదితర అంశాల ని యంత్రణ కోసం తెలంగాణ పశుసంవర్ధకశాఖ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రతిపాదనలు అం దజేసింది. కాగా తెలంగాణలో ప్రతిపాదనల దశలో ఉండగా.. తాజాగా ఈ విధానాన్ని ఏపీ ప్రభుత్వం అమల్లోకి తీసుకొచ్చింది.