PM Modi | ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) ఆంధ్రప్రదేశ్ పర్యటనలో ఉన్నారు. ఈ సందర్భంగా ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీశైలం (Srisailam) మల్లన్న స్వామిని దర్శించుకున్నారు. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో కర్నూలు చేరుకున్న ప్రధాని.. అక్కడి నుంచి సీఎం చంద్రబాబు (N Chandrababu Naidu), డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌తో కలిసి హెలికాప్టర్లో సున్నిపెంటకు చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గంలో శ్రీశైలం వెళ్లారు.
ఆలయానికి చేరుకున్న ప్రధానికి అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దర్శన ఏర్పాట్లు చేశారు. ఈ సందర్భంగా సీఎం, డిప్యూటీ సీఎంతో కలిసి ప్రధాని మోదీ శ్రీభ్రమరాంబ, మల్లికార్జున స్వామివార్లను దర్శించుకున్నారు. మల్లికార్జునస్వామికి పంచామృతాలతో రుద్రాభిషేకం చేశారు. అమ్మవారి కుంకుమార్చన సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం ప్రధానికి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు.
ప్రధాని పర్యటన నేపథ్యంలో శ్రీశైలం పరిసర ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. సున్నిపెంట వద్ద సుమారు 1500 మంది సిబ్బందితో భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. శ్రీశైలంలో తన పర్యటనను ముగించుకుకొని ప్రధాని మధ్యాహ్నం 2:30 గంటలకు కర్నూలు బయల్దేరి వెళ్తారు. ‘సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్’ పేరుతో గురువారం కర్నూలులో జరిగే బహిరంగ సభకు ప్రధాని మోదీ హాజరుకానున్నారు.
Also Read..
మల్లోజుల బాటలో ఆశన్న!.. వనం వీడుతున్న మావోయిస్టు పార్టీ అగ్రనేతలు
అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్‌లు.. హెచ్ఆర్లో15 శాతం మందిపై వేటు
రోడ్లు సరిగా లేకుంటే పన్ను చెల్లించం.. కాంగ్రెస్ సర్కారుకు బెంగళూరు ప్రజల హెచ్చరిక