న్యూఢిల్లీ: ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ మరోసారి భారీగా ఉద్యోగుల తొలగింపునకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నది. మానవ వనరుల విభాగంలోని 15 శాతం మందిని తగ్గించేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు చెబుతున్నారు. దీనిని అంతర్గతంగా పీపుల్స్ ఎక్స్పీరియన్స్ అండ్ టెక్నాలజీ (పీఎక్స్‌టీ) బృందం అని పిలుస్తారు.
ఈ తొలగింపుల వల్ల హెచ్ఆర్ విభాగంపై ఎక్కువ ప్రభావం పడుతున్నప్పటికీ, మిగతా విభాగాల్లో కూడా లేఆఫ్‌లు ఉంటాయని భావిస్తున్నారు. ఇటీవలే కంపెనీ వినియోగదారుల విభాగాల గ్రూప్‌లైన అమెజాన్ వెబ్ సర్వీసెస్, వండరీ పాడ్‌క్యాస్ట్ ఆర్మ్‌లలో కొద్ది సంఖ్యలో తొలగింపులు చేపట్టారు. తాజా తొలగింపుల ద్వారా ఆటోమేషన్, సామర్థ్యం వైపు సంస్థ మొగ్గును చూపిస్తున్నది.