కృష్ణ కాలనీ, అక్టోబర్ 16 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేటీకే – 6ఇంకె్లైన్లో విధులు నిర్వర్తిస్తున్న ఎస్ శ్రీనివాస్‌రెడ్డి మిస్టర్ కోల్ ఇండియా టైటిల్ విన్నర్‌గా నిలిచారు. నాగపూర్‌లో జరుగుతున్న కోల్ ఇండియా ఇంటర్ కంపెనీ వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ అండ్ బాడీ బిల్డింగ్ పోటీల్లో శ్రీనివాస్‌రెడ్డితో పాటు భూపాలపల్లి ఏరియాలోని పలువురు ఉద్యోగులు పథకాలు సాధించినట్లు ఏరియా అధికార ప్రతినిధి కావూరి మారుతి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
పతకాలు సాధించిన వారిలో కేటీకే-6వ గనిలో కోల్ కట్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న ఎస్ శ్రీనివాస్ రెడ్డి (బాడీ బిల్డింగ్ 85కిలోల విభాగంలో స్వర్ణం), సీనియర్ అండర్ మేనేజర్ మీర్జా యాసీన్ బేగ్ (పవర్ లిఫ్టింగ్ పురుషుల 120కి. లో పసిడి), ట్రామర్ బానోత్ రమేశ్ (పవర్ లిఫ్టింగ్ పురుషుల విభాగం 59కి. బంగారు పతకం), జనరల్ అసిస్టెంట్ డీ అనూష (పవర్ లిఫ్టింగ్ మహిళల 69కి.లో రజతం) సాధించినట్లు తెలిపారు.