శ్రీశైలం, అక్టోబర్ 15: ఏపీలోని శ్రీశైలం డ్యాం సమీపంలోని పాతాళగంగ మెట్ల వద్ద చిరుత మృత్యువాతపడింది. బుధవారం ఉదయం స్థానికులు తెలిపిన సమాచారంతో అటవీశాఖ అధికారులు ఘటనా స్థలానికి వెళ్లి చిరుత కళేబరాన్ని స్వాధీనపర్చుకున్నారు.
జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతంలో చిరుత మృతి చెందడంపై డీఎఫ్వో విఘ్నేశ్వరప్ప అనుమానం వ్యక్తం చేశారు. అనారోగ్యమా? లేక వేటగాళ్లు ఉచ్చు వేశారా? లేదా విషప్రయోగం జరిగిందా? అన్న కోణంలో దర్యాప్తు చేస్తామని తెలిపారు.