Telangana Spice Kitchen | కారం, మసాలా, అల్లం వెల్లుల్లి దట్టించిన తెలంగాణ వంటలకు దేశవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. సంప్రదాయ తెలంగాణ వంటకాలకు ఆధునికతను జోడించి అందిస్తున్నది.. తెలంగాణ స్పైస్ కిచెన్. హైదరాబాద్ జూబ్లీహిల్స్‌లోని ఈ రెస్టారెంట్లో ఎల్లిపాయకారం రొయ్యలు, కొర్రమీను పులుసు, పప్పుచారు అన్నం, నాటుకోడి రోస్ట్ వంటి మనవైన వంటకాలను రుచి చూడవచ్చు. నాటుకోడి పులుసు-చిల్లుగారె రెస్టారెంట్ స్పెషల్ వంటకం. వెజ్, నాన్-వెజ్ రెండూ సిద్ధం. అంతేకాదు బెల్లం, మిరియాలు, యాలకులతో చేసిన పానకాన్నీ ట్రై చేయొచ్చు. తెలంగాణ పల్లెల్లో కనిపించే అందమైన వాతావరణాన్ని కూడా ఇక్కడ ఆస్వాదించవచ్చు.
“Neem Wood | మీ వంటింట్లో వేప చెక్క ఉందా?”
“T Kitchen | ఈ రెస్టారెంట్ గేటు మొదలు నేల, కుర్చీలు, లైట్లు.. అన్నీ గులాబీ రంగులోనే ఉంటాయి”
“T Kitchen | ఈ రెస్టారెంట్ గేటు మొదలు నేల, కుర్చీలు, లైట్లు.. అన్నీ గులాబీ రంగులోనే ఉంటాయి”
“ఈ రెస్టారెంట్‌కి వెళ్తే గుహలో కూర్చొని తిన్నట్టే ఉంటుంది!!”