Neem Wood Kitchen Utensils | ఇటీవలి కాలంలో ప్రకృతి సిద్ధమైన ఉత్పత్తులకు గిరాకీ పెరిగిపోతున్నది. ‘మీ టూత్ పేస్ట్‌లో ఉప్పు ఉందా?’ అన్న తరహాలో ‘మీ సబ్బులో నిమ్మ ఉందా?’, ‘మీ నూనెలో ఉసిరి ఉందా?’.. లాంటి ప్రశ్నలతో ప్రచారం జరుగుతున్నది. ఇలాంటి ప్రశ్నే ఇంకోటి రాబోతున్నది? ‘మీ వంటింట్లో వేప చెక్క ఉందా?’. అవును. ఇప్పుడు ప్లేట్లు, గరిటెల్లాంటి వంటింటి సామగ్రిని సైతం వేపకర్రతో తయారు చేస్తున్నారు.
‘నీమ్ ఉడ్ కిచెన్ యుటెన్సిల్’ పేరిట ఇవి బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయి. స్పూన్లు, ఫోర్క్‌లు, గరిటెలు, అట్లకాడలు, చిన్న గిన్నెలు, ప్లేట్లు.. ఇవికాక చాపింగ్ బోర్డులు, రొట్టెల పీటలు, వాటర్ బాటిళ్ల లాంటివీ రూపొందుతున్నాయి. చక్కటి ఫినిషింగ్‌తో కృత్రిమమైన రంగులు, రసాయనాల పూతలూ లేకుండా వీటిని తయారు చేస్తున్నారు. వేడి వంటలకు అయినా, చల్లని పదార్థాలకు అయినా చక్కగా వాడుకోవచ్చు. చూసేందుకూ కళాత్మకంగా కనిపిస్తాయి కాబట్టి .. ఇటు అందం, అటు ఆరోగ్యం!
“ఫ్రెంచ్ కంపెనీ తీసుకొచ్చిన ఈ డైనింగ్ సెట్స్ చూశారా !!”