wood kitchen | టీ స్పూన్ నుంచి ప్లేట్లు, గిన్నెల దాకా అన్ని చెక్కవే.. ఇప్పుడిదే ఫ్యాషన్
wood kitchen | అన్నిట్లోనూ కొత్తదనాన్ని కోరుకుంటున్నారు జనం. ఇంటికొచ్చిన అతిథులను సంభ్రమాశ్చర్యాల్లో ముంచెత్తాలనే తపనతో.. ఆన్లైన్-ఆఫ్‌లైన్ మార్కెట్ మీద ఓ కన్నేసి ఉంచుతున్నారు. అవి కూడా ప్లాస్టిక్‌కు దూరంగా, పర్యావరణహితంగా ఉండాలని ఆశిస్తున్నారు. ఆ జాబితాలో ఇప్పుడు.. చెక్క వస్తువులు చేరాయి. చిన్న టీ స్పూన్ నుంచి గరిటె వరకు అన్నిటికీ చెక్కకే ఓటేస్తున్నారు. అతిథులకు చిరుతిళ్లు, పండ్లు పెట్టడానికి కూడా చెక్క ప్లేట్లు, గిన్నెలనే ఎంచుకుంటున్నారు.

ఖటియా ప్లాటర్
ప్రత్యేక సందర్భాల్లో అతిథులకు అల్పాహారం, స్నాక్స్ వడ్డించేందుకు ఈ కొత్తరకం ప్లాటర్ బాగుంటుంది. బుల్లిసైజు మంచంలా ఉండే ఈ ట్రే మీద పూల డిజైన్ భలేగా ఆకట్టుకుంటుంది. ఇది పూర్తిగా హస్తకళ. ధర రూ.1,195 వరకూ.

ఠేలా స్నాక్ ప్లాటర్ ట్రే
అచ్చు తోపుడుబండిని పోలిన ఈ ట్రే ట్రాలీ చూపరులను ఆకర్షిస్తుంది. దీన్ని స్నాక్స్, శాండ్విచ్, చిప్స్, సమోసాలు సర్వ్ చేసేందుకు వాడతారు. నాలుగు చక్రాలు ఉండటంవల్ల డైనింగ్ టేబుల్, టీపాయ్ మీద సులువుగా అటూ ఇటూ జరపొచ్చు. పూర్తిగా చెక్కతో చేసిన ఈ ట్రే ధర రూ.749.

ఐరన్ ప్లాటర్ ట్రాలీ
ఈ ట్రాలీ ఇటు ప్లాటర్గానూ అటు ఇంటి అలంకరణలోనూ ఉపయోగపడుతుంది. పూర్తిగా ఇనుముతో తయారు చేశారు. దీంట్లో చిప్స్, బిస్కెట్స్, పాప్‌కార్న్, పకోడీ లాంటివి సర్వ్ చేస్తే కొత్తగా ఉంటుంది. దీన్ని తడి స్పాంజ్‌తో సులువుగా శుభ్రం చేసుకోవచ్చు. ఆత్మీయులకు బహుమతిగానూ ఇవ్వొచ్చు. డిస్కౌంట్ పోనూ ధర రూ.799.

వెదురు ప్లేట్లు
ప్రస్తుతం, ఆన్లైన్లో వెదురు హవా నడుస్తున్నది. అందులో ఒకటే.. బ్యాంబూ ఉడెన్ ప్లేట్స్. ఇంటికొచ్చిన అతిథులకు ప్లాస్టిక్, ఫైబర్ ప్లేట్లలో కాకుండా ఎంచక్కా చెక్క ట్రేలలో టీ, కాఫీల నుంచి స్నాక్స్ వరకు అన్నీ సర్వ్ చేయవచ్చు. ఒకే సెట్లో వివిధ సైజుల ప్లేట్లు వస్తున్నాయి. ఆన్
లైన్లో వీటి ధర రూ.1,720 వరకూ.

ఉడెన్ బౌల్
ఇప్పటికీ చాలా పల్లెల్లో చెక్క గిన్నెలనే వాడుతుంటారు. నగరాల్లో ఈమధ్యే ఆదరణ పెరిగింది. కొందరు ఇంట్లోనే కొబ్బరి చిప్పలతో వీటిని తయారు చేస్తున్నారు. ఆన్లైన్ మార్కెట్లో కూడా చెక్కతో చేసిన బౌల్స్ అందుబాటులో ఉన్నాయి. గిన్నె ఫినిషింగ్, డిజైన్, కలప రకాన్ని బట్టి ధరలు మారుతాయి. అటూ ఇటుగా రూ.1,000 నుంచి రూ.3,500 వరకు పలుకుతాయి.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
కన్నబిడ్డలు కాదనుకున్న అమ్మానాన్నలకు కొడుకు అయ్యాడు
Gudipadu | తెలంగాణలోని ఈ గుడిలో గిరిజనులే పూజారులు
Insect Museum | బెంగళూరులో కీటకాలకు ఓ మ్యూజియం..ఇందులో ఏం ఉంటాయంటే..
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

