Insect Museum | బెంగళూరులో కీటకాలకు ఓ మ్యూజియం..ఇందులో ఏం ఉంటాయంటే..

Insect Museum in Bengaluru | కీటకమే కదా అని చిన్నచూపు చూడకండి. నిర్దయగా కాలికింద నలిపేయకండి. సృష్టిలోని ప్రతి జీవికీ ఓ బాధ్యత ఉంటుంది. ‘వాటి వల్ల నాకేమిటి లాభం?’ అంటూ పక్కా లెక్కల జీవిలా ఆలోచించడం మానేస్తే.. కీటకమే ప్రేమగా తన కథ చెబుతుంది. అవన్నీ వినడానికి బెంగళూరులోని కీటక మ్యూజియంకు వెళ్తే సరితుంది. త్వరలోనే, ఆ విజ్ఞానశాల తలుపులు తెరుచుకోనున్నాయి.

సృష్టిలో లక్షలకొద్దీ కీటక జాతులు ఉన్నాయి. మన దేశంలో ఆ సంఖ్య ఆరు లక్షల పైమాటే. వీటిలో మనకు తెలిసినవి రెండుమూడొందల రకాలే. నేటి తరానికైతే సీతాకోకచిలుక, తేనెటీగ, కందిరీగ, తూనీగ వంటి పదుల రకాలే తెలుసు. రసాయన వ్యవసాయం, రేడియేషన్ ప్రభావం వల్ల వేల కీటక జాతులు ఉనికిని కోల్పోతున్నాయి. దీంతో, ప్రస్తుతం మనుగడ సాగిస్తున్న కీటకాలు, పురుగు జాతులను కనుగొనే పనిలో పడ్డారు శాస్త్రవేత్తలు. వాటిలో ఇప్పటివరకు 2 లక్షల రకాలను జాగ్రత్తగా భద్రపరిచారు. మరిన్ని అరుదైన జాతుల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. భావితరాలకు కీటక నిధిని అందించడమే తమ విధిగా శ్రమిస్తున్నారు.

కీటకాల మ్యూజియం
ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్, నేషనల్ బ్యూరో ఆఫ్ అగ్రికల్చర్ ఇన్సెక్ట్ రిసోర్సెస్ ఆధ్వర్యంలో బెంగళూరులో కీటకాల కోసం ప్రత్యేకంగా ఓ మ్యూజియం ఏర్పాటైంది. దీని పేరు.. నేషనల్ ఇన్సెక్ట్ మ్యూజియం. ప్రపంచంలోని అతిపెద్దవైన, అత్యంత చిన్నవైన కీటకాలనూ ఇక్కడ చూడొచ్చు. ఎన్నో అరుదైన, అందమైన జాతులు కొలువుదీరాయి. వీటి ఆకారాలు, పరిమాణాల్లో పోలికే ఉండదు. మొత్తం ఆరు లక్షల రకాల జాతులను కనుగొనడమే లక్ష్యంగా పెట్టుకున్నారు కీటకశాస్త్ర నిపుణులు. హిమాలయాల నుంచి కన్యాకుమారి వరకు.. అన్ని చోట్లా లభించే కీటకాలను ఇక్కడ భద్రపరుస్తున్నారు.

ప్రత్యేక పేటికలు, ఆధునిక ఫ్రీజర్లు
తాతముత్తాతల కాలం నుంచీ మన తరం వరకూ..ఎన్నో కీటకాలను, పురుగు జాతులను అక్కడ చూడొచ్చు. చీమలు, సీతాకోక చిలుకలు, తేనెటీగలు మొదలైన వాటిని ప్రత్యేకమైన పేటికలు, ఫ్రీజర్లలో భద్రపరిచారు. మొత్తం 11 ర్యాకులలో ఇప్పటివరకు 2 లక్షల కీటక జాతులను సేకరించిపెట్టారు. నిజానికి, ఇదో పెద్ద పని. ప్రయాసతో కూడిన వ్యవహారం కూడా. కొన్ని కీటకాలను ఉదయమే పట్టుకోగలం. మరికొన్ని రాత్రిళ్లు సులభంగా దొరుకుతాయి. ఇందుకోసం జిగురు, పసుపుతో కూడిన ప్రత్యేక ద్రావణాన్ని ఉపయోగిస్తారు. రాత్రిళ్లు సేకరించే కీటకాల కోసం వలలు ఉపయోగిస్తారు. వీటిలో కొన్ని ప్రయోజనకరమైనవి, కొన్ని కీడు కలిగించేవి. ‘కీటక రకం ఏదైనా వాటిని భద్రపరచడమే మా బాధ్యత’ అంటారు మ్యూజియం డైరెక్టర్ నగేశ్. ఈ మ్యూజియాన్ని సామాన్యులు సందర్శించేందుకూ తగిన ఏర్పాట్లు చేశారు.

అరుదైన జాతుల కోసం
తమిళనాడులోని వాల్పరై తేయాకు తోటల్లో కనిపించే ఒక అరుదైన కీటక జాతి కోసం పదేండ్లుగా వెతుకుతున్నారు శాస్త్రవేత్తలు. అది వర్షకాల ప్రారంభంలో మాత్రమే బయటికొస్తుంది. దాదాపు మూడుసార్లు కుండపోత వర్షాల్లో వెతికినా జాడ తెలియలేదు. ఆ తర్వాత ఓ కీటక శాస్త్రజ్ఞుడు ఇచ్చిన సమాచారం మేరకు కోయంబత్తూరులో పట్టుకోగలిగారు. తమిళనాడులోని ఆర్కాడ్లో ప్రపంచంలోనే అతిచిన్న రెక్కలు కలిగిన ‘కికికి హున’ అనే కీటకాన్ని గుర్తించారు. దీన్ని కంటితో చూడలేం. మైక్రోస్కోప్ ఉండాల్సిందే. ఇదొక చిన్న కందిరీగ, పరాన్నజీవి. అయితే దీనికి ఒక కీటకానికి ఉండాల్సిన లక్షణాలన్నీ ఉంటాయి. ఆరు కాళ్లు, రెక్కలు, పునరుత్పత్తి, శ్వాసకోశ వ్యవస్థలు ఉన్నాయి. అలాగే, ప్రపంచంలోనే అతిపెద్ద కీటకంగా పరిగణించే అట్లాస్ చిమ్మట పురుగును కూడా ఇక్కడ చూడొచ్చు.
లోకల్ టు గ్లోబల్ వార్తల కోసం.. నమస్తే తెలంగాణ ఫేస్బుక్, ట్విటర్ పేజీలను ఫాలో అవ్వండి
ఇవి కూడా చదవండి..
అతని ఎత్తు మూడు అడుగులే.. కానీ ఆత్మవిశ్వాసం ఆకాశమంత..
సూట్‌కేసులో దాక్కొని 7000 కిమీలు ప్రయాణించిన బల్లి.. ఎందుకో తెలుసా?
నేనా లేక మటనా? ఏది కావాలో తేల్చుకో అన్న భర్తకు భార్య ఇచ్చిన సమాధానం ఏంటో తెలుసా?
అప్పుడు విడిపోయారు.. ఇప్పుడు కలిశారు.. 35 ఏళ్ల తర్వాత పెళ్లితో ప్రేమజంట శుభం కార్డు
Read Today's Latest Sunday News in Telugu and Telugu News
- Tags
- insect museum
- insects
- museum
RELATED ARTICLES
తాజా వార్తలు
CJP Leaders | పౌరులపై మోదీ ప్రభుత్వం యుద్ధం చేస్తోంది.. ఇది బహిరంగ ఎమర్జెన్సీ.. సీజేపీ నేతల ఆరోపణ
Hurricane Isaias | అమెరికాను అతలాకుతలం చేసిన హరికేన్ ఇసైయాస్.. టోర్నడో ముప్పు ఉందని హెచ్చరిక..!
Assaulting CJP Protesters | సీజేపీ నిరసనకారులపై ‘హిందూ రక్షా దళ్’ వ్యక్తులు దాడి.. నలుగురు అరెస్ట్
Assam Girl | ఆగస్టులో డ్యాన్స్ ట్రూప్‌తో కలిసి ఇక్కడికొచ్చారు.. అసోం యువతి హిమ శ్రీ బోరా మృతిపై పోలీసులు ఏమన్నారంటే..?
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

