హైదరాబాద్: రైతు రుణమాఫీ, ఆరు హామీల అమలుపై సీఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరిన మాజీ మంత్రి హరీశ్ రావు.. అన్న మాట ప్రకారం తన రాజీనామా పత్రంతో అసెంబ్లీ ఎదురుగా ఉన్న గన్‌పార్క్‌లోని (Gun Park) అమరవీరుల స్తూపం వద్దకు బయల్దేరారు. ఈ నేపథ్యంలో గన్‌పార్క్‌కు బీఆర్ఎస్ కార్యకర్తలు, నేతలు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. అయితే గన్‌పార్క్ వద్ద ఎక్కువ మంది గుమికూడ వద్దంటూ పోలీసులు వారిని అక్కడి నుంచి బయటకు పంపివేస్తున్నారు. దీంతో పోలీసులు, బీఆర్ఎస్ కార్యకర్తలకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకున్నది.
కాగా, గన్‌పార్క్‌కు వద్దకు తమను అనుమతించకపోవడంతో అసెంబ్లీ వద్ద ఆందోళన చేసేందుకు బీఆర్ఎస కార్యకర్తలు సిద్ధమయ్యారు. దీంతో అక్కడి నుంచి కూడా వారిని బలవంతంగా పంపించివేశారు.