Smriti Irani | అమేథిలో కాంగ్రెస్ పార్టీ ఓటమిని అంగీకరించింది.. రాహుల్ రాయ్‌బరేలి పోటీపై స్మృతి ఇరానీ వ్యాఖ్య
Smriti Irani | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ ఎన్నికల్లో అమేథి (Amethi) నుంచి కాకుండా రాయ్‌బరేలి (Raebareli) నుంచి పోటీకి దిగడంపై బీజేపీ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani ) స్పందించారు.
Smriti Irani | కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఈ ఎన్నికల్లో అమేథి (Amethi) నుంచి కాకుండా రాయ్‌బరేలి (Raebareli) నుంచి పోటీకి దిగడంపై బీజేపీ ఎంపీ అభ్యర్థి, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ (Smriti Irani ) స్పందించారు. అమేథిలో గాంధీలు ఎవరూ ఎన్నికల బరిలో నిలవకపోవడం పోలింగ్‌కు ముందే ఇక్కడ ఓటమిని కాంగ్రెస్ అంగీకరించిందని ఎద్దేవా చేశారు.
‘గాంధీ కుటుంబీకులు అమేథిలో పోటీ చేయకపోవడాన్ని బట్టి చూస్తుంటే పోలింగ్‌కు ముందే వారు ఓటమిని అంగీకరించారు. ఈ సీటుపై విజయం సాధించే అవకాశం ఉందని వారు భావించినట్లయితే వారే పోటీకి దిగేవారు. మరో అభ్యర్థిని నిలబెట్టేవాళ్లే కాదు. రాహుల్ గాంధీ ఇక్కడి నుంచి వెళ్లిపోవడమంటే అది అమేథి ప్రజల విజయమే’ అని స్మృతి ఇరానీ వ్యాఖ్యానించారు. మే 20న జరిగే ఎన్నికల్లో అమేథి నుంచి మళ్లీ తానే గెలుస్తానని ఈ సందర్భంగా కేంద్ర మంత్రి ధీమా వ్యక్తం చేశారు.
అమేథి ప్రజలు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వ హయాంలో అభివృద్ధిని చూశారని ఈ సందర్భంగా స్మృతి ఇరానీ అన్నారు. మోదీ హయాంలో అభివృద్ధిని చూసిన అమేథి వాసులు.. గాంధీ కుటుంబం ఆధ్వర్యంలో ఇక్కడ అభివృద్ధి ఎందుకు జరగలేదని, ఆ కుటుంబం ఈ ప్రాంతానికి ఇంత నష్టం ఎందుకు చేసిందని అడుగుతున్నారని స్మృతి ఇరానీ తెలిపారు. ‘వయనాడ్‌లో పోలింగ్ తర్వాత రాహుల్ కొత్త సీటు కోసం చూస్తారని ప్రధాని ముందే ఊహించారు. అది ఈరోజు జరిగింది. మీరూ చూస్తున్నారు’ అని కేంద్ర మంత్రి వ్యాఖ్యానించారు.
కాగా, అమేథి లోక్‌సభ నియోజకవర్గం గాంధీ కుటుంబానికి కంచుకోట అన్న విషయం తెలిసిందే. గతంలో సంజయ్ గాంధీ, రాజీవ్ గాంధీ, సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఈ స్థానం నుంచి గెలుపొందారు. ఇక 2004లో రాహుల్ తొలిసారి అమేథి నుంచి పోటీ చేసి గెలుపొందారు. 2009, 2014 ఎన్నికల్లో వరుసగా అమేథి నుంచే విజయం సాధించారు. అయితే 2019లో జరిగిన ఎన్నికల్లో మాత్రం బీజేపీ ఎంపీ అభ్యర్థి, ప్రస్తుత కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ చేతిలో ఓటమిపాలయ్యారు. ఆ ఎన్నికల్లో రాహుల్ అమేథితోపాటు కేరళలోని వయనాడ్ నుంచి కూడా పోటీ చేశారు. అక్కడ మాత్రం గెలుపొంది.. ప్రస్తుతం ఎంపీగా కొనసాగుతున్నారు. ఇక ఈ ఎన్నికల్లో అమేథి లోక్‌సభ స్థానానికి స్మృతి ఇరానినే బీజేపీ బరిలోకి దింపింది.
Also Read..
Rain | తడిసి ముద్దైన బెంగళూరు సిటీ.. ఎండ నుంచి ఉపశమనం
Prajwal Revanna | ప్రజ్వల్ రేవణ్ణను కృష్ణుడితో పోలుస్తూ.. వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన కర్ణాటక మంత్రి
Bomb Threat | జీలం ఎక్స్‌ప్రెస్ రైలుకు బాంబు బెదిరింపులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

