Panchayat Elections | తెలంగాణ పంచాయతీ ఎన్నికలకు ముహూర్తం ఖరారైంది. ఎల్లుండి (గురువారం) సర్పంచ్ ఎన్నికల నోటిఫికేషన్ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనుంది. ఈ మేరకు ఇవాళ సాయంత్రం ఆరు గంటలకు ఎన్నికల షెడ్యూల్ను ఎన్నికల కమిషన్ విడుదల చేయనున్నట్లు సమాచారం.
తాజా సమాచారం ప్రకారం.. డిసెంబర్ 11వ తేదీన తొలి విడతలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలుస్తోంది. ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. అదే రోజు మధ్యాహ్నం 2 గంటలకు కౌంటింగ్ ప్రారంభించి, ఫలితాలను విడుదల చేయనున్నట్లు సమాచారం. నాలుగు రోజుల తేడాతో రెండు, మూడో విడత ఎన్నికలు నిర్వహించి, ఫలితాలను ప్రకటించనున్నట్లు తెలుస్తోంది.

Panchayat Elections