– ముక్త కంఠంతో నినదించిన సింగరేణి కార్మిక సంఘాలు
– నాలుగు లేబర్ కోడ్స్ పత్రాల కాల్చివేత
రామవరం, నవంబర్ 25 : కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను తొలగించి, 4 చట్ట స్వభావం లేని కోడ్స్‌గా మార్చడాన్ని సింగరేణి కార్మిక సంఘాలన్నీ ముక్తకంఠంతో వ్యతిరేకించాయి. కొత్త కోడ్స్ ను రద్దు చేసి పాత 29 చట్టాలనే కొనసాగించాలని కార్మిక సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. కేంద్రం తీసుకువస్తున్న నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కార్మిక సంఘాలన్నీ ధర్నాలు, ఆందోళనలు, సమ్మెలు చేసినా కేంద్రం పెడచెవిన పెడుతుందని దుయ్యబట్టారు. కార్పొరేట్ కంపెనీలు, పెట్టుబడిదారుల కోసమే కేంద్రం పని చేస్తుందని ఆరోపించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నాలుగు లేబర్ కోడ్ లను అనుమతించమని, వాటిని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిలపక్ష యూనియన్ల ఆధ్వర్యంలో మంగళవారం కొత్తగూడెం ఏరియాలోని వెంకటేష్ ఖనీ కోల్ మైన్ లో నాలుగు లేబర్ కోడ్స్ పత్రాలను తగలబెట్టారు. అనంతరం మేనేజర్ మురళికి మెమోరాండం అందజేశారు. అన్ని గనుల డిపార్ట్మెంట్లలో నల్ల బ్యాడ్జీలతో నిరసనలు తెలిపారు. ఈ నెల 26 ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టర్లకు మెమోరాండంలు ఇవ్వడం, అదే రోజు సాయంత్రం 3.30కి సింగరేణి వ్యాప్తంగా అన్ని జీఎం కార్యాలయాల ముందు ధర్నా కార్యక్రమాలను నిర్వహించనున్నట్టు తెలిపారు.
ఈ నిరసన కార్యక్రమాలకు అన్ని సంఘాల కార్యకర్తలు, నాయకులు, కార్మికులు పాల్గొని విజయవంతం చేయాలని వారు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్ ముఖ్య నాయకులు టిబిజికెఎస్ చీఫ్ జనరల్ సెక్రటరీ కాపు కృష్ణ, ఏఐటీయూసీ నాయకులు పిట్ సెక్రటరీ ఏం ఆర్ కే ప్రసాద్, కొత్తగూడెం ఏరియా ఐఎన్టీయూసీ వైస్ ప్రెసిడెంట్ రజాక్, సిఐటియు నాయకులు శ్రీరామ్మూర్తి ఏఐటీయూసీ, ఐఎన్టీయూసీ, సీఐటీయూ, టీబీజీకేఎస్ ముఖ్య నాయకులు గడప రాజయ్య, గోపు కుమార్, విప్లవ కుమార్, హీరోలాల్, విజయ్, జిఎస్ శ్రీనివాస్, ఆంజనేయులు, వసంత్, మంగన్ రవి, రాజ్ కుమార్, సంతోష్ పాల్గొన్నారు.

Ramavaram : ‘కొత్త లేబర్ కోడ్స్‌ను రద్దు చేసి పాత చట్టాలనే కొనసాగించాలి’