ధర్పల్లి, నవంబర్ 24 : నిజామాబాద్ జిల్లా ధర్పల్లి మండల కేంద్రంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీలో గందరగోళం నెలకొన్నది. భీమ్గల్ రోడ్డులో నిర్మించిన 48 డబుల్ బెడ్రూం ఇండ్లను సోమవారం అధికారులు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి పలువురికి ఇండ్ల పత్రాలను అందజేయగా.. పేదలైన తమకు కూడా ఇండ్లు అందజేయాలని నినాదాలు చేస్తూ స భను అడ్డుకునేందుకు మహిళలు యత్నించారు. మహిళా పోలీసులు వారిని వారించి, అడ్డుకున్నారు. ఇందిరమ్మ ఇండ్లు అందజేస్తామని ఎమ్మెల్యే సదరు మహిళలకు సూచించారు.