సిరిసిల్ల టౌన్, నవంబర్ 24: తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి సెస్ కార్యాలయం వరకు సెస్ కార్మికులు ర్యాలీ తీసి, కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. తెలంగాణ స్టేట్ యునైటెడ్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు ఈశ్వర్రావు మాట్లాడారు. సెస్ సంస్థలో పని చేస్తున్న అన్ని విభాగాల్లోని ఉద్యోగులకు వెంటనే పదోన్నతు లు కల్పించాలని, కారుణ్య నియామక సిబ్బందిని వెంటనే రెగ్యులరైజ్ చేయాలని డిమాండ్ చేశారు. మానిటరీ బెన్ఫిట్స్ ఇవ్వాలని కోరారు. సెప్టెంబర్-2025లో ఇవ్వాల్సిన ఇంక్రిమెంట్తోపాటు పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో సమ్మెలోకి వెళ్తామని హెచ్చరించారు.