సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ కార్మికులు చేస్తున్నటువంటి నిరవధిక దీక్షకు మద్దతుగా వేములవాడ మండలం హనుమాజీపేట వద్ద ప్రజాగొంతుక ఆధ్వర్యంలో పొలంలో నిరసన చేపట్టారు.
తమ సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తా నుంచి సెస్ కార్యాలయం వరకు సెస్ కార్మికులు ర్యాలీ తీసి, కార్యాలయం ఎదుట ధర్నా చేశారు.