Vemulawada | వేములవాడ రూరల్, మార్చి 12 : సిరిసిల్ల జిల్లా కేంద్రంలో సెస్ కార్మికులు చేస్తున్నటువంటి నిరవధిక దీక్షకు మద్దతుగా వేములవాడ మండలం హనుమాజీపేట వద్ద ప్రజాగొంతుక ఆధ్వర్యంలో పొలంలో నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా పుప్పాల మోహన్ మాట్లాడుతా గత నాలుగు సంవత్సరాలుగా సెస్ కార్మికులు ప్రభుత్వ విప్‌కు విన్నవించినా పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం ఆలోచించి కార్మికుల సమస్యలు వెంటనే పరిష్కరించాలని, వారికి లైఫ్ సెక్యూరిటీ ఇవ్వాలని, రూ.కోటి ప్రమాద బీమా కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.