Telangana Cabinet | హైదరాబాద్ : ఈ నెల 25వ తేదీన తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. మంగళవారం ఉదయం 11 గంటలకు సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఈ భేటీకి మంత్రులతో పాటు ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. డెడికేటెడ్ కమిషన్ సిఫారసులను కేబినెట్ ఆమోదించే అవకాశం ఉంది. పంచాయతీ ఎన్నికల్లో 50 శాతానికి మించకుండా రిజర్వేషన్లు కల్పించాలని డెడికేటెడ్ కమిషన్ సిఫార్సు చేసింది.